ఆరోగ్యం – Jayakethanam https://jayakethanam.com Tue, 09 Sep 2025 09:45:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://jayakethanam.com/wp-content/uploads/2025/08/cropped-IMG-20250816-WA0065-32x32.jpg ఆరోగ్యం – Jayakethanam https://jayakethanam.com 32 32 గంజాయి,డ్రగ్స్,మాదక ద్రవ్యాలు అరికట్టాలి. https://jayakethanam.com/telangana/%e0%b0%97%e0%b0%82%e0%b0%9c%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b0%97%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b0%95-%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5/ https://jayakethanam.com/telangana/%e0%b0%97%e0%b0%82%e0%b0%9c%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b0%97%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b0%95-%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5/#respond Tue, 09 Sep 2025 09:42:44 +0000 https://jayakethanam.com/?p=2526   జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 09   గంజాయి–డ్రగ్స్,మాదక ద్రవ్యాలు అరికట్టాలి.ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వద్దు, మన ఆరోగ్యమే ముద్దు”అనే నినాదంతో అవగాహన సదస్సు పోస్టర్ ను మంగళవారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) హుజుర్ నగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం లో తహశీల్దార్ నాగార్జున రెడ్డి,స్థానిక ఏరియా హాస్పిటల్ లో, (R.M.O )డాక్టర్. రవి కుమార్ లు కరపత్రం ఆవిష్కరించారు అనంతరం పట్టణ కార్యదర్శి మీసాల వీరబాబు మాట్లాడుతూ మూడు రోజుల […]

The post గంజాయి,డ్రగ్స్,మాదక ద్రవ్యాలు అరికట్టాలి. appeared first on Jayakethanam.

]]>
 

జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 09

 


గంజాయి–డ్రగ్స్,మాదక ద్రవ్యాలు అరికట్టాలి.ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వద్దు, మన ఆరోగ్యమే ముద్దు”అనే నినాదంతో అవగాహన సదస్సు పోస్టర్ ను మంగళవారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) హుజుర్ నగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం లో తహశీల్దార్ నాగార్జున రెడ్డి,స్థానిక ఏరియా హాస్పిటల్ లో, (R.M.O )డాక్టర్. రవి కుమార్ లు కరపత్రం ఆవిష్కరించారు అనంతరం పట్టణ కార్యదర్శి మీసాల వీరబాబు మాట్లాడుతూ మూడు రోజుల క్రితం చర్లపల్లి ఇండస్ట్రియల్ ప్రాంతంలో డ్రగ్స్ ముఠా బయటపడింది దాదాపు 12 వేల కోట్ల విలువగల ప్రమాదకరమైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకొని 13 మందిపై కేసు నమోదు చేశారు. ఈ డ్రగ్స్ రాకెట్ కు సంబంధించిన నిందితులందరినీ పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని మద్యానికి గంజాయి కి బానిసలు కావద్దని కోరారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే క్యాంపియన్ చేసి ప్రజలను చైతన్యం చేయాలని అధికారులకు తెలిపారు.రేపులు,మర్డర్లు,అత్యాచారాలు కిడ్నాపులు,నిరుద్యోగం, అప్పులవడం, ఆత్మహత్య లు అన్నిటికీ మూల కారణం కేవలం డ్రగ్స్ (మత్తు) మాత్రమే అని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ అనేవి ఒక్క వ్యక్తి జీవితాన్నే కాదు, ఒక కుటుంబాన్నీ, ఒక సమాజాన్నీ నాశనం చేస్తాయి. విద్యార్థి జీవితానికి ఉన్న అతి పెద్ద సంపద ‘ఆరోగ్యం,విద్య – అనేది బంగారు బాటకు భవిష్యత్తు లాంటిది,కానీ డ్రగ్స్ వాడకం మొదలైన క్షణం నుంచి ఇవన్నీ క్షీణించిపోతాయి. ఒక విద్యార్థి తన భవిష్యత్తు కోల్పోతే, అది తల్లిదండ్రుల కష్టానికి, సమాజ అభివృద్ధికి పెద్ద దెబ్బ అవుతుంది.కాబట్టి ప్రతి యువతి, యువకులు– డ్రగ్స్‌కి దూరంగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఉన్నత లక్ష్యాలను సాధించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో , పట్టణ కమిటీ సభ్యులు,పట్టణ ఉపాధ్యక్షులు రామాల అనిల్,నక్కినబోయిన శంకర్ కె. సాయి, తదితరులు పాల్గొన్నారు.

The post గంజాయి,డ్రగ్స్,మాదక ద్రవ్యాలు అరికట్టాలి. appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%97%e0%b0%82%e0%b0%9c%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b0%97%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b0%95-%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5/feed/ 0
గర్భిణీ స్త్రీ మృతి కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ https://jayakethanam.com/telangana/%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ad%e0%b0%bf%e0%b0%a3%e0%b1%80-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%ae%e0%b1%83%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b1%81/ https://jayakethanam.com/telangana/%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ad%e0%b0%bf%e0%b0%a3%e0%b1%80-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%ae%e0%b1%83%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b1%81/#respond Mon, 01 Sep 2025 08:20:53 +0000 https://jayakethanam.com/?p=2485 జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 01 సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్సై ఏడుకొండలతో కలిసి మాట్లాడుతూమోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఐదు నెలల గర్భవతి బయ్య అనూష మృతి చెందిన కేసులో సోమవారం ముగ్గురు నిందితులను సూర్యాపేట పట్టణంలోని రితిక హోటల్ వద్ద అరెస్టు చేయడం జరిగినది. అబార్షన్ చేయడానికి సూర్యాపేట పట్టణం ఒమేగా హాస్పిటల్ లో ఏర్పాటు […]

The post గర్భిణీ స్త్రీ మృతి కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ appeared first on Jayakethanam.

]]>
జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 01

సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్సై ఏడుకొండలతో కలిసి మాట్లాడుతూమోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఐదు నెలల గర్భవతి బయ్య అనూష మృతి చెందిన కేసులో సోమవారం ముగ్గురు నిందితులను సూర్యాపేట పట్టణంలోని రితిక హోటల్ వద్ద అరెస్టు చేయడం జరిగినది. అబార్షన్ చేయడానికి సూర్యాపేట పట్టణం ఒమేగా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన హస్పటల్ నిర్వాహకులు ఏ1 గోరంట్ల సంజీవ, ఏ6 వీరబాయిన వేణు, స్కానింగ్ చేయడానికి అబార్షన్ చేయడానికి ఏర్పాటు చేసిన ఏ2 జాల జానయ్య లను అరెస్ట్ చేయడం జరిగినదన్నారు

*కేసు వివరాలు*

సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం గ్రామానికి చెందిన భయ్యా నగేష్ కు ఇద్దరు ఆడపిల్లలు భార్య బయ్య అనూష మూడోసారి గర్భం దాల్చి ఐదో నెల గర్భవతి గా ఉండగా గర్భంలో ఉన్నది ఆడ, మగ అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో తన దగ్గరి బంధువైన అదే గ్రామానికి చెందిన ఏ8 ఉప్పల సందీప్ ద్వారా టేకుమట్ల గ్రామంలో ఆర్ఎంపీ గా పని ఏ2 జాల జానయ్య ను సంప్రదించి నకిరేకల్ కు చెందిన ఆర్ఎంపీ ఏ3 బాత్క యాదగిరి వద్ది 17/05/2025 రోజున అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా అక్రమ స్కానింగ్ నిర్వహించి గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని తెలుసుకున్నారు. దీనికి గాను జానయ్య మృతురాలి భర్త ఏ9 బయ్య నగేష్ నుండి రూ.12 వేల రూపాయలు తీసుకున్నాడు.గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని తెలిసిన అనంతరం అబార్షన్ చేయించాలనే ఉద్దేశ్యంతో ఏ2 జానయ్య ద్వారా తేది: 17/05/2025 రోజున సూర్యాపేట పట్టణంలో గల ఒమేగా హాస్పటల్ (సంజీవిని హాస్పటల్) కు వచ్చి ఏ1 గోరంట్ల సంజీవ, ఏ6 వీరబోయిన వేణును సంప్రదించి కూసుమంచి కి చెందిన ఆర్.ఎం.పి నాగరాజు, అర్వపల్లి కి చెందిన ఆర్.ఎం.పి చెవుగొని గణేష్ లతో అబార్షన్ చేయించారు. అబార్షన్ వికటించి తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమించడంతో ఖమ్మంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ పరీక్ష చేసిన వైద్యులు 5వ నెల గర్భవతి అయిన భయ అనూష మృతి చెందినదని నిర్ధారించారు, అనూషను అదే రోజున రాఘవపురం గ్రామంలో అంత్యక్రియలు చేశారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి కార్యాలయం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా నేరం సంఖ్య 197/2025 ప్రకారం సెక్షన్ 105, 90 భారతీయ న్యాయ సంహిత బి ఎన్ ఎస్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 23, ప్రి కన్సెప్షన్ ప్రి నటల్ డయాగ్నటిక్ టెక్నిక్స్ ఆక్ట్ 1994 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పదిమంది నిందితులుగా చేర్చడం జరిగినది.

నిందితులు :
A1 – గోరంట్ల సంజీవ, సూర్యాపేట పట్టణ, ఒమేగా హాస్పిటల్ మేనేజ్మెంట్.
A2 – జాల జానయ్య టేకుమట్ల గ్రామము, సూర్యాపేట మండలం, ఆర్ఎంపీ డాక్టర్.
A3 – బాత్క యాదగిరి, నకిరేకల్ పట్టణం, ఆర్ఎంపీ డాక్టర్.(అరెస్ట్ 08/08/2025)
A4 – నాగరాజు, కూసుమంచి, ఖమ్మం జిల్లా, ఆర్ఎంపీ డాక్టర్.
A5 – చౌగాని గణేష్, అర్వపల్లి గ్రామం, ఆర్ఎంపీ డాక్టర్.(అరెస్ట్, మే 29వ తేది)

A6 – వీరబోయిన వేణు, సూర్యాపేట పట్టణం, ఒమేగా హాస్పిటల్ మేనేజ్మెంట్.
A7 – పిడమర్తి శోభ సూర్యపేట టౌన్, హాస్పిటల్ నర్స్.
A8 – ఉప్పల సందీప్, సర్వారం గ్రామం, మోతే మండలం. *(అరెస్ట్, మే 29వ తేది)*
A9 – భయ్యా నగేష్, మృతురాలి భర్త, రాఘవపురం, మోతే మండలం.
A10 – తొట్ల గణేష్, వర్ధమానుకోట గ్రామం, నాగారం మండలం, నివాసము విద్యానగర్ సూర్యాపేట.

కేసు దర్యాప్తు చేసి ఇందులో నిందితుడైన ఏ8 ఉప్పల సందీప్ హాస్పటల్లో పనిచేసిన అనుభవం నుండి టేకుమట్ల గ్రామానికి చెందిన జానయ్యను సంప్రదించడానికి మృతురాలి భర్తకు సహాయం చేశాడు, సందీప్ ను మే నెల 29వ తారీఖున అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగింది, అబార్షన్ చేసిన A5 చౌవుగోని గణేష్ ను మే నెల 29వ తారీకు అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది. నకిరేకల్ నందు మృతురాలికి స్కానింగ్ చేసి ఆడ శిశు అని నిర్ధారించిన ఆర్ఎంపీ డాక్టర్ బత్క యాదగిరిని ఆగస్టు ఎనిమిదో తారీఖున అరెస్టు చేసి రిమాండ్ పంపడం జరిగింది.

 

The post గర్భిణీ స్త్రీ మృతి కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ad%e0%b0%bf%e0%b0%a3%e0%b1%80-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%ae%e0%b1%83%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b1%81/feed/ 0
గంజాయి–డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అరికట్టాలి.ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వద్దు మన ఆరోగ్యమే ముద్దు” పోస్టర్ ఆవిష్కరించిన ఎస్సై మోహన్ https://jayakethanam.com/telangana/%e0%b0%97%e0%b0%82%e0%b0%9c%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b0%97%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b0%95-%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5/ https://jayakethanam.com/telangana/%e0%b0%97%e0%b0%82%e0%b0%9c%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b0%97%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b0%95-%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5/#respond Tue, 26 Aug 2025 07:50:33 +0000 https://jayakethanam.com/?p=2420   జయ కేతనం న్యూస్ ఆగస్ట్ 26 హుజూర్‌నగర్ పట్టణ కేంద్రంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ ఐ) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో “గంజాయి – డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అరికట్టాలి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వద్దు, మన ఆరోగ్యమే ముద్దు”అనే నినాదంతో అవగాహన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుజూర్‌నగర్ సబ్ ఇన్స్పెక్టర్ బండి మోహన్ బాబు చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో […]

The post గంజాయి–డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అరికట్టాలి.ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వద్దు మన ఆరోగ్యమే ముద్దు” పోస్టర్ ఆవిష్కరించిన ఎస్సై మోహన్ appeared first on Jayakethanam.

]]>
 

జయ కేతనం న్యూస్ ఆగస్ట్ 26

హుజూర్‌నగర్ పట్టణ కేంద్రంలో
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ ఐ) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో “గంజాయి – డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అరికట్టాలి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వద్దు, మన ఆరోగ్యమే ముద్దు”అనే నినాదంతో అవగాహన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుజూర్‌నగర్ సబ్ ఇన్స్పెక్టర్ బండి మోహన్ బాబు చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ముఖ్యంగా విద్యార్థి యువతలో గంజాయి మరియు మాదకద్రవ్యాల వాడకం ఒక భయంకరమైన సమస్యగా మారింది.డ్రగ్స్ ఒకసారి అలవాటు అయితే అది చదువు,ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ సమస్యను ఎదుర్కోవడంలో కేవలం పోలీస్ వ్యవస్థ మాత్రమే కాదు, సమాజం అంతా – విద్యార్థులు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసికట్టుగా ముందుకు రావాలి. సైబర్ నేరాలపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇతర యాప్‌లు, ఫిషింగ్ లింకులు, ఇమెయిల్స్ ద్వారా హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దు.ఫోన్‌లో వచ్చే ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌, పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే, కేవైసీ అప్‌డేట్ వంటి సందేశాలకు స్పందించరాదు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు సంప్రదించాలి.అన్ని అన్నారు.
తరువాత డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి మీసాల వీరబాబు మాట్లాడుతూ “ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. వీటిని అరికట్టడం కోసం ప్రతి విద్యార్థి, యువకుడు, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు అవగాహన కలిగి ముందుకు రావాలి. డివైఎఫ్ ఐ తరఫున ఇలాంటి కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మీసాల వీరబాబు, టౌన్ అధ్యక్షుడు ఇందిరాల నరేష్ పట్టణ కమిటీ సభ్యులు, గోబ్బి రాము, రామాల అనిల్,నక్కినబోయిన శంకర్,జడ సాయి,కె. సాయి,జడ గోపి,చంద్రు తదితరులు పాల్గొన్నారు.

The post గంజాయి–డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అరికట్టాలి.ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వద్దు మన ఆరోగ్యమే ముద్దు” పోస్టర్ ఆవిష్కరించిన ఎస్సై మోహన్ appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%97%e0%b0%82%e0%b0%9c%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b0%97%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b0%95-%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5/feed/ 0
మాంసపు దుకాణాలను పరిశీలించిన అధికారులు https://jayakethanam.com/telangana/%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%b8%e0%b0%aa%e0%b1%81-%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b0%be%e0%b0%a3%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b6%e0%b1%80%e0%b0%b2%e0%b0%bf/ https://jayakethanam.com/telangana/%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%b8%e0%b0%aa%e0%b1%81-%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b0%be%e0%b0%a3%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b6%e0%b1%80%e0%b0%b2%e0%b0%bf/#respond Sun, 24 Aug 2025 08:19:26 +0000 https://jayakethanam.com/?p=2364 జయకేతనం న్యూస్ ఆగస్టు 24 సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల మాంసపు దుకాణాలను కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.పెంటయ్య,వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మేరిగ అశోక్ తో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. హుజూర్ నగర్ పట్టణంలో గొర్రెలు మేకలు పశువులు పంది చేపల మాంసం విక్రయించు దుకాణాలు 40 వున్నట్లుగా గుర్తించగా అట్టి దుకాణాలలో తనిఖీలు నిర్వహించగా 16 దుకాణాలు మార్కెట్లలో మాంసం విక్రయిస్తున్నారని, […]

The post మాంసపు దుకాణాలను పరిశీలించిన అధికారులు appeared first on Jayakethanam.

]]>
జయకేతనం న్యూస్ ఆగస్టు 24

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల మాంసపు దుకాణాలను కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.పెంటయ్య,వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మేరిగ అశోక్ తో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. హుజూర్ నగర్ పట్టణంలో గొర్రెలు మేకలు పశువులు పంది చేపల మాంసం విక్రయించు దుకాణాలు 40 వున్నట్లుగా గుర్తించగా అట్టి దుకాణాలలో తనిఖీలు నిర్వహించగా 16 దుకాణాలు మార్కెట్లలో మాంసం విక్రయిస్తున్నారని, 03 దుకాణాలలో ఇండ్ల మధ్యలో మాంసం విక్రయిస్తుండగా 21 దుకాణాలు రోడ్ల పైన మాంసం విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు.ఇట్టి సమగ్ర రిపోర్టుని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు వారు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ జవాన్లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

The post మాంసపు దుకాణాలను పరిశీలించిన అధికారులు appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%b8%e0%b0%aa%e0%b1%81-%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b0%be%e0%b0%a3%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b6%e0%b1%80%e0%b0%b2%e0%b0%bf/feed/ 0
వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డాక్టర్ నరేష్ మామిడి https://jayakethanam.com/telangana/%e0%b0%b5%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2-%e0%b0%86%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%86%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af/ https://jayakethanam.com/telangana/%e0%b0%b5%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2-%e0%b0%86%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%86%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af/#respond Fri, 15 Aug 2025 14:06:54 +0000 https://jayakethanam.com/?p=2199 జయకేతనం న్యూస్ ఆగస్టు 15 సూర్యాపేటజిల్లా కేంద్రంలోని వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం జాతీయ పతాకాన్ని వెన్నెల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నరేష్ మామిడి ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా ఫ్రీడమ్ చెకప్ ద్వారా 13, 14, 15, తారీకులలో ఓపి ఉచిత సౌకర్యం కల్పించినట్లు, అదేవిధంగా ఈనెల 14న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 30 మంది వలస కార్మికులకు ఉచితంగా ఓపి, చికిత్స, […]

The post వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డాక్టర్ నరేష్ మామిడి appeared first on Jayakethanam.

]]>

జయకేతనం న్యూస్ ఆగస్టు 15

సూర్యాపేటజిల్లా కేంద్రంలోని వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం జాతీయ పతాకాన్ని వెన్నెల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నరేష్ మామిడి ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా ఫ్రీడమ్ చెకప్ ద్వారా 13, 14, 15, తారీకులలో ఓపి ఉచిత సౌకర్యం కల్పించినట్లు, అదేవిధంగా ఈనెల 14న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 30 మంది వలస కార్మికులకు ఉచితంగా ఓపి, చికిత్స, ల్యాబ్, మందుల, సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల కృషి ఫలితంగానే బ్రిటిష్ వలస పాలకుల నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వెన్నెల ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్లు బయ్య నారాయణ, బయ్య దయాకర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

The post వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డాక్టర్ నరేష్ మామిడి appeared first on Jayakethanam.

]]>
https://jayakethanam.com/telangana/%e0%b0%b5%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2-%e0%b0%86%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%86%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af/feed/ 0