గంజాయి,డ్రగ్స్,మాదక ద్రవ్యాలు అరికట్టాలి.

 

జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 09

 


గంజాయి–డ్రగ్స్,మాదక ద్రవ్యాలు అరికట్టాలి.ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వద్దు, మన ఆరోగ్యమే ముద్దు”అనే నినాదంతో అవగాహన సదస్సు పోస్టర్ ను మంగళవారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) హుజుర్ నగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం లో తహశీల్దార్ నాగార్జున రెడ్డి,స్థానిక ఏరియా హాస్పిటల్ లో, (R.M.O )డాక్టర్. రవి కుమార్ లు కరపత్రం ఆవిష్కరించారు అనంతరం పట్టణ కార్యదర్శి మీసాల వీరబాబు మాట్లాడుతూ మూడు రోజుల క్రితం చర్లపల్లి ఇండస్ట్రియల్ ప్రాంతంలో డ్రగ్స్ ముఠా బయటపడింది దాదాపు 12 వేల కోట్ల విలువగల ప్రమాదకరమైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకొని 13 మందిపై కేసు నమోదు చేశారు. ఈ డ్రగ్స్ రాకెట్ కు సంబంధించిన నిందితులందరినీ పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని మద్యానికి గంజాయి కి బానిసలు కావద్దని కోరారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే క్యాంపియన్ చేసి ప్రజలను చైతన్యం చేయాలని అధికారులకు తెలిపారు.రేపులు,మర్డర్లు,అత్యాచారాలు కిడ్నాపులు,నిరుద్యోగం, అప్పులవడం, ఆత్మహత్య లు అన్నిటికీ మూల కారణం కేవలం డ్రగ్స్ (మత్తు) మాత్రమే అని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ అనేవి ఒక్క వ్యక్తి జీవితాన్నే కాదు, ఒక కుటుంబాన్నీ, ఒక సమాజాన్నీ నాశనం చేస్తాయి. విద్యార్థి జీవితానికి ఉన్న అతి పెద్ద సంపద ‘ఆరోగ్యం,విద్య – అనేది బంగారు బాటకు భవిష్యత్తు లాంటిది,కానీ డ్రగ్స్ వాడకం మొదలైన క్షణం నుంచి ఇవన్నీ క్షీణించిపోతాయి. ఒక విద్యార్థి తన భవిష్యత్తు కోల్పోతే, అది తల్లిదండ్రుల కష్టానికి, సమాజ అభివృద్ధికి పెద్ద దెబ్బ అవుతుంది.కాబట్టి ప్రతి యువతి, యువకులు– డ్రగ్స్‌కి దూరంగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఉన్నత లక్ష్యాలను సాధించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో , పట్టణ కమిటీ సభ్యులు,పట్టణ ఉపాధ్యక్షులు రామాల అనిల్,నక్కినబోయిన శంకర్ కె. సాయి, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్