న్యాయవాదుల రక్షణా చట్టాన్ని వెంటనే రూపొందించి అమలు చేయాలి

 

జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 09

న్యాయవాదుల రక్షణ కొరకు న్యాయవాదుల రక్షణా చట్టాన్ని రూపొందించి వెంటనే అమలు చేయాలని హుజూర్ నగర్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. జీడిమెట్ల కు చెందిన న్యాయవాది బండారు సురేష్ బాబు పై కొందరు దుండగులు దాడి చేసి గాయపరిచిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ అందుకు నిరసనగా హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం తమ విధులను బహిష్కరించి కోర్టు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణా చట్టాన్ని వెంటనే రూపొందించి అమలు పరచనట్లయితే దేశవ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమించి ప్రభుత్వాలను స్తంభింప చేస్తామని హెచ్చరించారు. వృత్తి ధర్మంలో భాగంగా తమ వద్దకు వచ్చిన కక్షిదారుల తరఫున చట్టపరంగా కేసులను వాదిస్తూ చట్టానికి లోబడి పని చేస్తున్న న్యాయవాదులపై ప్రతివాద కక్షిదారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని భౌతిక దాడులకు పాల్పడటం దౌర్జన్యాలు చేయటం బెదిరించటం న్యాయ వ్యవస్థకే గొడ్డలి పెట్టన్నారు. తమ విధుల బహిష్కరణ కు సహకరించాలని కోరుతూ బార్ అసోసియేషన్ చేసిన తీర్మాన కాపీలను రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి లక్ష్మీ శారద, సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణ చౌహన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మారుతీ ప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీనా లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి చనగాని యాదగిరి, ఉపాధ్యక్షుడు జక్కుల నాగేశ్వరరావు,అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు,న్యాయవాదులు ధూళిపాల శ్రీనివాసరావు, ఎం ఎస్ రాఘవరావు, ఉప్పల గోపాలకృష్ణమూర్తి, ఉదారి యాదగిరి, పాలేటి శ్రీనివాసరావు, రమణారెడ్డి, రామ లక్ష్మారెడ్డి, సైదా హుస్సేన్, రామినేని వెంకటేష్, చక్రాల వెంకటేశ్వర్లు, బానోతు శ్రీను నాయక్, గుగులోతు వెంకటేష్ నాయక్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్