సమాచార హక్కు చట్టం క్రింద పేదలకు ఉచిత సమాచారం అందించాల్సిందే తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

సమాచార హక్కు చట్టం క్రింద
పేదలకు ఉచిత సమాచారం అందించాల్సిందే తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 7
సమాచార హక్కు చట్టం-2005, అమలులోకి వచ్చి 20 ఏళ్లు అవుతున్నా ఎక్కడ చట్టం సక్రమంగా అమలవుతున్న తీరు కనపడడం లేదు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుదారుడు సమాచారం కోరినట్లయితే సరైన సమయంలో సమాచారం అధికారులు అందజేయడం లేదు. సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన అధికారులకు ఉన్న దానిని దాటవేయడం కోసం కొర్రీలు పెడుతూ దరఖాస్తుదారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. రెవెన్యూ అధికారులు అయితే సమాచార హక్కు చట్టం ఒక్కటే మా పని కాదంటూ భూభారతి అప్లికేషన్లు ఉన్నాయంటూ, క్యాస్ట్ లు ఇన్కమ్ లు ప్రజల సమస్యలు అన్నింటి చూడాల్సిన బాధ్యత తమదేనంటూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వారికి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ అధికారుల పాలిట మరో మార్గదర్శకం అయినా దరఖాస్తుదారుల పాలిట వరంలా మారింది. వివరాలలోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలానికి చెందిన జి. గణేష్ అనే న్యాయ విద్యార్థి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద పంచాయతీ కార్యదర్శి కి దరఖాస్తు చేసుకున్నారు.అయితే పంచాయతీ కార్యదర్శి సమాచారం ఇవ్వడానికి రూ.6,171 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ గణేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 7(5)ను ప్రస్తావించారు. ఈ సెక్షన్ ప్రకారం, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న దరఖాస్తుదారులకు ఎలాంటి రుసుము వసూలు చేయకుండా సమాచారం అందించాలని స్పష్టం చేశారు. RTI Act కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (BPL) వారికి ఉచితంగా సమాచారం అందించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు సమాచారం కోసం ఛార్జీలు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఈ తీర్పు పేదలకు తమ హక్కుల గురించి తెలుసుకోవడానికి, ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచడానికి ఒక కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఈ తీర్పుతో ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకునే పేదల నుంచి అక్రమంగా రుసుములు వసూలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. చట్టాన్ని సరిగ్గా అమలు చేయడంలో అధికారులకు ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా ప్రజలు ముఖ్యంగా పేదలు తమ హక్కులను వినియోగించుకోవడానికి ఇది మరింత ప్రోత్సాహం అందిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ఈ చట్టాన్ని మరింత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ తీర్పు సమాచార హక్కు చట్టం యొక్క అసలు స్ఫూర్తిని నిలబెడుతుందని సమాచార ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్