జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు.
సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు.
సూర్యాపేట జిల్లా ఎస్ పి కె.నరసింహ
జయకేతనం న్యూస్ సెప్టెంబర్07
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జనం కార్యక్రమాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగాయని సూర్యాపేటజిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఉత్సవం ఎలాంటిదైనా అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో జరుపుకున్నారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకున్న స్ఫూర్తి భవిష్యత్తులో కూడా చూపాలని ఆయన కోరారు. ఉత్సవం ఏదైనా ప్రజలంతా సంతోషంగా నిర్వహించుకోవాలని జిల్లా పోలీస్ శాఖ తరపున పూర్తి భద్రత రక్షణ ఎల్లప్పుడు కల్పించడం జరుగుతుందన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి, జిల్లా పోలీస్ లకు సహకరించిన ప్రజలకు,ఉత్సవ కమిటీలకు,భక్తులకు, ముఖ్యంగా సమయ స్పూర్తి చూపిన యువతకు ఎస్పీ ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసిన అన్ని శాఖల అధికారులకు, బందోబస్తు నిర్వహించిన పోలీసు సిబ్బందికి అందరికి అభినందనలు తెలిపారు.









