రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి

రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి

8.35 ఎకరాల భూమిని సాదా బైనామా రిజిస్ట్రేషన్ చేయడానికి 2 లక్షల లంచం డిమాండ్

జయకేతనం న్యూస్ జనవరి 23

ఫిర్యాదుధారుని పేరిట 8.35 ఎకరాల భూమిని సాదా బైనామా రిజిస్ట్రేషన్ చేయడానికి సంబంధించిన దస్తావేజును ప్రాసెస్ చేసి పంపించడానికి ఫిర్యాదుధారుని నుండి ఆదిలాబాద్ జిల్లా లోని బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ వారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌ గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి రూ.2,00,000/-లంచం తీసుకుంటుండ గా అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలన్నారు అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునన్నారు.ఫిర్యాదుధారుల/బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్