ముజాహిద్ ప్రజల సమస్యల కోసం ముందుండి పోరాడుతున్నారు

ముజాహిద్ ప్రజల సమస్యల కోసం ముందుండి పోరాడుతున్నారు

జయ కేతనం హైదరాబాద్ సెప్టెంబర్ 9

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ సమస్యలపై సమాజ్‌వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ టైగర్ అలీ నవాబ్ పోలీస్ నజర్ కోరుట్ల డివిజన్ రిపోర్టర్ మహమ్మద్ సాదిక్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ కోరుట్లలో ప్రతి వార్డులో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని రోడ్లు సరిగా లేవు డ్రైనేజీ సక్రమంగా పనిచేయడం లేదు. తాగునీరు ఆరోగ్యం విద్య ఉపాధి సమస్యలు పరిష్కారం కాకుండా కొనసాగుతున్నాయి. ప్రజలను పట్టించుకునే నిజమైన నాయకత్వం ఈ నియోజకవర్గానికి చాలా అవసరం.తాను ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడ్డాను ఇకముందు కూడా అదే చేస్తానని తెలిపారు.

టైగర్ అలీ నవాబ్ మాట్లాడుతూ

ప్రజల అసలు సమస్యలను వెలుగులోకి తేవడం మీడియా బాధ్యత అని ముజాహిద్ ఎప్పుడూ ప్రజల సమస్యల కోసం ముందుండి పోరాడుతున్నారు. ఆయన నాయకత్వం కోరుట్లలో చాలా అవసరం. ఇలాంటి నిజాయితీ గల నాయకులు ఉండడం ప్రజలకు ఆశ చూపుతుంది. ముజాహిద్ పోరాటం అభినందనీయమని తెలిపారు.

మహమ్మద్ సాదిక్ మాట్లాడుతూ

ప్రజల కోసం నిజాయితీ గల నాయకులు ముందుకు రావాలి. ముజాహిద్ ఎప్పుడైనా ప్రజల సమస్య వస్తే ముందుంటారు. అలాంటి నాయకత్వం కోరుట్ల ప్రజలకు వరమని చెప్పాలి. సమస్యలను బయటకు తేవడం సమాజానికి ఉపయోగకరమన్నారు

చివరగా మహమ్మద్ ముజాహిద్ కీలక నిర్ణయం ప్రకటిస్తూ రాబోయే కౌన్సిలర్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులను నిలబెట్టబోతున్నాం. ప్రజల సమస్యలతో మమేకమై పని చేసే నిజమైన ప్రజాప్రతినిధులను ముందుకు తెస్తాం సమాజ్‌వాది పార్టీ భారతదేశంలోనే అతి పెద్ద మూడవ పార్టీగా నిలిచింది. ఈ బలం ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రతిఫలించబోతోంది అని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్