జయ కేతనం న్యూస్ ఆగస్ట్ 26
హుజూర్‌నగర్ పట్టణ కేంద్రంలో
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ ఐ) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో “గంజాయి – డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అరికట్టాలి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వద్దు, మన ఆరోగ్యమే ముద్దు”అనే నినాదంతో అవగాహన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుజూర్‌నగర్ సబ్ ఇన్స్పెక్టర్ బండి మోహన్ బాబు చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ముఖ్యంగా విద్యార్థి యువతలో గంజాయి మరియు మాదకద్రవ్యాల వాడకం ఒక భయంకరమైన సమస్యగా మారింది.డ్రగ్స్ ఒకసారి అలవాటు అయితే అది చదువు,ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ సమస్యను ఎదుర్కోవడంలో కేవలం పోలీస్ వ్యవస్థ మాత్రమే కాదు, సమాజం అంతా – విద్యార్థులు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసికట్టుగా ముందుకు రావాలి. సైబర్ నేరాలపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇతర యాప్‌లు, ఫిషింగ్ లింకులు, ఇమెయిల్స్ ద్వారా హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దు.ఫోన్‌లో వచ్చే ఓటీపీ, ఓఎల్‌ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే, కేవైసీ అప్‌డేట్ వంటి సందేశాలకు స్పందించరాదు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు సంప్రదించాలి.అన్ని అన్నారు.
తరువాత డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి మీసాల వీరబాబు మాట్లాడుతూ “ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. వీటిని అరికట్టడం కోసం ప్రతి విద్యార్థి, యువకుడు, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు అవగాహన కలిగి ముందుకు రావాలి. డివైఎఫ్ ఐ తరఫున ఇలాంటి కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మీసాల వీరబాబు, టౌన్ అధ్యక్షుడు ఇందిరాల నరేష్ పట్టణ కమిటీ సభ్యులు, గోబ్బి రాము, రామాల అనిల్,నక్కినబోయిన శంకర్,జడ సాయి,కె. సాయి,జడ గోపి,చంద్రు తదితరులు పాల్గొన్నారు.









