ఈనెల 13,14న ఖమ్మం లో జరిగే యాదవుల రేజంగ్ లా రజ కలశ యాత్రను జయప్రదం చేయండి అఖిలభారత యాదవ మహాసభ నాయకులు మల్లిబాబు యాదవ్, వెంకట నరసయ్య, సింహాద్రి యాదవ్

జయకేతనం న్యూస్

ఈనెల 13,14న ఖమ్మంజిల్లాలో అఖిలభారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టనున్న యాదవ రేజంగ్ లా రాజ్ కలశ యాత్రను రాజకీయాలు వర్గాలకతీతంగా యాదవులు పాల్గొని ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా జిల్లా యాదవుల ను ఉద్దేశించి అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, యాదవ యువజన జిల్లా అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ సోమవారం ఖమ్మం స్థానిక కృష్ణ ఫంక్షన్ హాల్ లో యాదవ రేజింగ్ లా కలశ యాత్ర ను గురించి చర్చించడానికి యాదవ సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. వక్తలు మాట్లాడుతూ 1962 భారత్ చైనా యుద్ధంలో అమరవీరులైన అహిర్ (యాదవ) రెజిమెంట్ కు సంబంధించిన 114 మంది యాదవ వీరుల ప్రాణ త్యాగాలను ఈ దేశం నిర్లక్ష్యం చేసి మరిచిపోయిందని, ఎంతో దేశభక్తితో చైనా ను మన భారతదేశంలోని భూభాగాన్ని ఆక్రమించకుండా అడ్డుకున్న యాదవ రెజిమెంట్ ను రద్దు చేయడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు యాదవ వీరుల స్మృత్యర్థం అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యాదవ రెజింగ్ లా కలశ యాత్ర ను చేపట్టడం జరిగిందని, దానిలో భాగంగా మన ఖమ్మం జిల్లాకు ఈనెల13న చేరుకుంటుందని, 14వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్, మయూరి సెంటర్ నుండి మహబూబాబాద్ వరకు జిల్లాలో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొరిమేకల కోటయ్య, పొదిల సతీష్, బమ్మిడి శ్రీనివాస్, సత్తి వెంకన్న, బొల్లి కొమరయ్య, మొరిమేకల అమరయ్య, చెవుల ఖాదర్ బాబా, తుప్పాతి రవికుమార్, తెల్లబోయిన రమణ, వాకధాని కోటేశ్వరరావు తొడేటి లింగరాజు, మేడుదుల మల్లేష్, పొదిల భూపతి, పొదిల తిరుపతిరావు ప్రవీణ్ యాదవ్ తదితర యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్