ఘనంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం ఎస్ ఆర్ రంగనాథన్ చిత్రపటానికి నివాళులర్పించిన ప్రిన్సిపాల్,అధ్యాపక బృందం

జయ కేతనం న్యూస్

కోదాడ కె ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా పద్మశ్రీ డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథన్ 133 వ జయంతి ని పురస్కరించుకొని గ్రంథాలయం విభాగం ఆధ్వర్యం లో జాతీయ గ్రంథాలయ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దివంగత ఎస్ ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హదస రాణి, అధ్యాపక బృందం నివాళుల ర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ హదస రాణి మాట్లాడుతూ భారతదేశంలో గ్రంధాలయ ఉద్యమా నికి మూల పురుషుడు ఎస్ ఆర్ రంగనాథన్ అన్నారు. భారతదేశంలో స్వాతంత్రో ద్యమ సమయంలో గ్రంథాలయ ఉద్యమం స్వాతంత్ర ప్రేరణలో ముఖ్య భూమిక పోషించింద న్నారు. విద్యార్థులు కళాశాల గ్రంథాలయం లోని పుస్తకాలను సద్వినియోగం చేసుకొని రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాల న్నారు. సాంకేతిక ప్రగతి తో అందిస్తు న్న డిజిటల్ లైబ్రరీ సౌకర్యాన్ని సైతం విద్యార్థులు సెల్ ఫోన్ల ద్వారా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చందా అప్పారావు, కళాశాల గ్రంథాల య అధికారి మాతంగి యాకో బు, అధ్యాపకులు నిర్మలా కుమారి, ఎస్.ఎం. రఫీ, పల్లపాటి సైదులు, ఫ్రాన్సిస్, సుమలత, సైదమ్మ, అధ్యాప కేతర సిబ్బంది వేణుగోపాల్, ఇస్మాయిల్, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్