జయకేతనం న్యూస్ ఆగస్టు 12
73 షెడ్యూల్ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతన జిఓ లను వెంటనే విడుదల చేయాలని సిఐ టియు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు యం.రాంబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది . ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో వివిధ పరిశ్రమల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాదిమంది కార్మికులు ఉద్యోగులు పనిచేస్తున్నారని వారికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేక కార్మికులు ఉద్యోగులు నిత్యం అనేక ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2021 సంవత్సరం జనవరిలో షెడ్యూల్ ఎంప్లాయిమెంట్లను జీవో నెంబర్ 21, 22 22,25 జీవోలను జారీ చేశారు కానీ, వాటిని గెజిట్ చేయకుండా పెండింగ్ లోనే ఉంచారు.తదుపరి మరో 12 ఎంప్లాయిమెంట్లను కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వానికి పంపినప్పటికీ 17 షెడ్యూల్ లలో కనీస వేతన సవరణ చేయకుండానే కమిషనర్ కార్యాలయంలోనే తొక్కిపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత పదేళ్లలో నాలుగు కనీస వేతనాల సలహా మండళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్న 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిస్ జీవోలలో కనీస వేతన నిర్ణయం సవరణల గురించి ప్రభుత్వానికి పలుమార్లు సిఫార్సులు కూడా చేయడం జరిగింది కనీస వేతన సవరణకు సుప్రీంకోర్టు తీర్పులను తీసుకోవాలని కనీస వేతనాల సలహా మండలి ప్రతిపాదనలు పక్కనపెట్టి క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తున్న కాలయాపనకు స్వస్తి పలుకుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనం చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వల్లపు దాసు సాయికుమార్ పెయింటర్స్ సూర్యాపేట పట్టణ కోశాధికారి కొత్తపల్లి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.









