టీజేఏ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేసిన జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా.

జయకేతనం న్యూస్ ఆగస్టు 15

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీజేఏ) జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో షేక్ సైదా జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజేఏ వ్యవస్థాపకులు ఎన్ యు జె (ఐ)జాతీయ మాజీ అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ టీజేఏ అధ్యక్షుడు వెంకటరమణారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్, స్టేట్ జనరల్ సెక్రెటరీ ఎంఆర్ ఘో రీ ల ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో టీజేఏ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం జర్నలిస్టులు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా టీజేఏ కోశాధికారి కొత్తపల్లి మధుసూదన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ భీమపంగు వెంకటేశ్వర్లు,కోల్లోజు నాగేంద్ర చారి మేళ్లచెరువు మండల టీజేఏ అధ్యక్షుడు కొమ్ము మహేష్, బయ్యారపు రవీంద్ర, పెందుర్తి సతీష్, గోరంట్ల శ్రీనివాస్ మహమ్మద్ యాసిన్, సూర్యాపేట పట్టణానికి చెందిన షేక్ అహ్మద్ అలీ మజీద్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్