వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డాక్టర్ నరేష్ మామిడి

జయకేతనం న్యూస్ ఆగస్టు 15

సూర్యాపేటజిల్లా కేంద్రంలోని వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం జాతీయ పతాకాన్ని వెన్నెల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నరేష్ మామిడి ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా ఫ్రీడమ్ చెకప్ ద్వారా 13, 14, 15, తారీకులలో ఓపి ఉచిత సౌకర్యం కల్పించినట్లు, అదేవిధంగా ఈనెల 14న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 30 మంది వలస కార్మికులకు ఉచితంగా ఓపి, చికిత్స, ల్యాబ్, మందుల, సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల కృషి ఫలితంగానే బ్రిటిష్ వలస పాలకుల నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వెన్నెల ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్లు బయ్య నారాయణ, బయ్య దయాకర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్