
జయకేతనం న్యూస్ ఆగస్టు 27
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం శ్రీనగర్ కాలనీ వివిఎం స్కూల్ నందు సన్మాన గ్రహీతలు డాక్టర్ బి ఎస్ జే మనోహర్ ఎంబిబిఎస్ డిజిఓ- డా. సుజాత ఎంబీబీఎస్ దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేముల ప్రేమ్ సాగర్ రాజు, మాజీ కౌన్సిలర్ అట్లూరు మంజుల, అట్లూరి హరిబాబు డాక్టర్ శ్వేత డాక్టర్ సునీల్ వి వి ఎం స్కూల్ ప్రధానోపాధ్యాయులు సిస్టర్ అనిత, సిస్టర్ బెల్లంకొండ పుష్ప, సిస్టర్ దివ్య పాల్గొనగా జొన్నలగడ్డ ప్రసాద్ శ్రీ పారుపల్లి చంద్రశేఖర్ తమ సందేశాలను అందించారు చిరు సన్మాన కవితను భయ్యారపు రామారావు ప్రారంభించగా ప్రశంసా పత్రాన్ని బయ్యారపు శ్రీదేవి సమర్పించారు డాక్టర్ మనోహర్ 1983 హుజూర్ నగర్ విచ్చేసి 1990లో సుజాత మనోహర్ నర్సింగ్ హోమ్ స్థాపించి 35 సంవత్సరాల పాటు హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు సేవలందించి డాక్టర్ గా ఎన్నో క్రిటికల్ కేసులను ఛేదించి విశిష్ట సేవలు అందించి ప్రజల మన్ననలను పొందారని, వారి అసాధారణ వైద్య సేవలకు ఆయన చేసిన కృషికి, వైద్య రంగంలో తాను చూపించిన ప్రతిభ మరియు సామాజిక సేవకు గుర్తింపుగా సేవలకు కృతజ్ఞతగా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జాషువా సాహిత్య వేదిక కమిటీ సభ్యులు బయ్యారపు రవీంద్ర, మీసాల రాంబాబు కొల్లోజు నాగేంద్ర చారి, కొత్తపల్లి మధుసూదన్, భీమ పంగు వెంకటేశ్వర్లు, వేల్పుల మోష, కర్నే శ్రీను, తురక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.









