నీరా ఆర్యా

జయకేతనం న్యూస్ ఆగస్టు 29

నీరా ఆర్యా ఈమె 1902 మార్చి 5న ఉత్తర ప్రదేశ్ లోని ఖేక్రానగర్ లో వ్యాపారవేత్త సేథ్ ఛజుమాల్ కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నప్పటి నుండి నిజమైన జాతీయవాది,స్వాతంత్ర్య పోరాట ఉద్యమంలో భాగం కావాలనే కోరిక కలకత్తాలో తండ్రి వ్యాపారం చక్కగా సాగడంతో (అతని వ్యాపారం దేశవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ కలకత్తా అతని వ్యాపారానికి కేంద్రంగా ఉంది) కలకత్తాలో ఆమె చదువు కొనసాగింది. ఆ సమయములో బెంగాలీ, హిందీ, ఇంగ్లీషు భాషలతోపాటు మరి కొన్ని భాషలు నేర్చుకుంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం లో ఉన్నత చదువులు చదివినా
ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ తో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది బోస్ అడుగుజాడలలో నడుస్తూ భారతదేశానికి బోస్ చేస్తున్న ఉద్యమానికి ఊపిరిలా ఆమె కొనసాగింది.బ్రిటిష్ వారి వద్ద పనిచేస్తున్న సిఐడి ఇన్స్పెక్టర్ “శ్రీకాంత్ జైరంజన్ దాస్”ను వివాహం చేసుకుంది. ఇద్దరి అభిప్రాయాలు వేరు నీరా ఆర్య దేశ భక్తి, జాతీయవాది, కానీ భర్త శ్రీకాంత్ జైరంజన్ దాస్ బ్రిటిష్ సేవకుడు.
సుభాష్ చంద్రబోస్ ను బ్రిటిష్ ప్రభుత్వం మట్టు పెట్టాలన్న సమయంలో శ్రీకాంత్ జైరంజన్ దాస్ బోస్ పై కాల్పులు జరపడంతో ఆ కాల్పులలో కాల్పులలో బోస్ డ్రైవర్ మరణించడం జరిగింది. దేశభక్తిని తన ఊపిరిగా దేశానికి స్వాతంత్రం తేవడమే తమ ఉద్యమ లక్ష్యంగా భావించిన నీరా ఆర్య బోస్ ను చంపడానికే ప్రయత్నించిన తన భర్తను కూడా దేశద్రోహిగా భావించి గొంతు కోసి మరి చంపి తన దేశభక్తిని చాటుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ కోసం గాలించు సమయంలో నీరా ఆర్య భర్తను చంపి లొంగిపోయిన తరువాత, ఎర్రఫోర్ట్ లో విచారణ జరిగినప్పుడు, ఖైదీలందరినీ విడుదల చేశారు నీరా ఆర్యకు మాత్రం తన భర్త హత్యకేసులో శిక్ష విధించబడింది, ఆమెను కాలాపాని జైలుకు (సెల్యులార్ జైలు, అండమాన్) పంపబడి, హింసించబడింది.

నీరా తన ఆత్మకథను.రాసిన ఉర్దూ రచయిత “ఫర్హానా తాజ్”కు తన నిరాశానిస్పృహల జీవిత కథలను పంచుకుంది. ఆ ఆత్మకథ లో (నీరా ఆర్య) విచారణలో ఉన్నప్పుడు, కాలాపాని జైలు పంపబడినప్పుడు, నీరా ను కలకత్తా జైలు నుండి అండమాన్ కు తీసుకురాబడ్డారు, అక్కడ ఖైదీలను నిర్బంధించడానికి సెల్స్ ఉన్నాయి. మహిళలు అలాగే వారి శిక్షను అనుభవిస్తున్నారు. మహిళలు రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు అక్కడ నిర్బంధించేవారు. ఈ లోతైన సముద్రంలో తెలియని ద్వీపంలో నివసిస్తున్నప్పుడు తనకు స్వేచ్ఛ ఎలా లభిస్తుందని తన మనస్సులో ఆందోళన కలిగింది, ఎంత చల్లగా ఉన్నప్పటికీ నేలపై నిద్రపోయేవారు. 12 గంటల సమయంలో ఒక గార్డు రెండు దుప్పట్లతో వచ్చి వాటిని ఆమె పై విసిరాడు, మాట్లాడకుండా వెళ్లిపోయాడు. అప్పటికి, తన చేతులు, కాళ్ళ చుట్టూ కట్టిన గొలుసులను ఎలా వదిలించుకోవాలో అని ఆందోళన, తాను తన మాతృభూమి నుండి విడిపోతున్న భావన కలిగింది. మరుసటి రోజు బ్లాక్ స్మిత్ వచ్చినప్పుడు అతను తన చేతి నుండి గొలుసును కత్తిరించడం ప్రారంభించినప్పుడు అతను ఆమె చేతి చర్మాన్ని కొద్దిగా తీసివేశాడు, ఆమె పట్టించుకోలేదు. అతను సుత్తి సహాయంతో ఆమె కాళ్ళ నుండి సంకెళ్లను కత్తిరించడం ప్రారంభించినప్పుడు అతను సంకెళ్లకు బదులుగా ఆమె ఎముకలను 2-3 సార్లు కొట్టాడు. ఇది చాలా బాధగా ఉన్నది అని చెప్పారట “మీరు నా కాళ్లను కొడుతున్నారని మీరు గుడ్డివారా”? అప్పుడు అతను జవాబిచ్చాడు, నేను మీ హృదయాన్ని కూడా కొట్టగలను, దాని గురించి మీరు ఏమి చేయగలరు? జైలర్ బదులిచ్చాడు,మీరు అబద్ధం చెప్పారు అతను ( నేతాజీ ) ఇంకా సజీవంగా ఉన్నాడు కాబట్టి నేను అవును అతను సజీవంగా ఉన్నాడు అని సమాధానం చెప్పాను. అప్పుడు జైలర్ అతను ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు?( నీరా) నా మనస్సులో నా హృదయంలో (గుండెలో) అని బదులిచ్చాను! జైలర్ కోపంతో, “అప్పుడు మేము నేతాజీని మీ హృదయం (గుండె) నుండి తొలగిస్తాము” అని. జైలర్ నన్ను అనుచితంగా తాకాడు, అసభ్యంగా ప్రవర్తించాడు. నీరా (నా) ఛాతీ ప్రాంతంలో వస్త్రాన్ని చీల్చిమని కమ్మరిని సూచించాడు. కమ్మరి వెంటనే కత్తెర తీసుకున్నాడు, దానిని కత్తిరించడానికి ఆమె కుడి రొమ్మును నొక్కడం ప్రారంభించాడు. నీరా భాదతో విలవిలలాడింది . జైలర్ “కత్తి పదునుగా లేనందువల్ల బతికి పోయావు..” అంటూ వదిలేశాడు జైలర్ ఇటువంటి బాధలను నీరా ఆర్య స్వాతంత్య్రం కొరకు ఎన్నో బాధలు పడ్డారు స్వాతంత్రం రావడంతో అనంతరం ఆమె హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ ప్రాంతం నిజాం నవాబుల పాలనలో ఉండడంతో స్వాతంత్రం కోసం ఆమె గూడాచారిగా ప్రభుత్వానికి నివేదిక అందించారని, తరువాత హైదరాబాద్ భారత దేశంలో విలీనం కావడంతో ఆమె హైదరాబాదులోనే చార్మినార్ ఏరియాలో పూలు అమ్ముకుంటూ, వచ్చిన డబ్బులతో చుట్టుపక్కల పిల్లలకు పాఠాలు బోధిస్తూ దేశభక్తిని నూరిపోస్తూ జీవనం కొనసాగించినట్లుగా ఆమె పూరి గుడిసెలో జీవిస్తూ ఉండగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆమె గుడిసె ప్రభుత్వ స్థలంలో ఉందని తొలగించి ఆమెకు గూడు లేకుండా చేసింది ఆమె ఎప్పుడూ ఆమె గురించి ఎవరికీ చెప్పలేదు ఎవరి సాయం కోరలేదు కోటీశ్వరులు అయినా ఆమె ఎప్పుడూ కడు బీదరికంలోనే జీవించింది. హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ జనరల్ వార్డులో వైద్యం పొందుతూ
1998 జూలై 26 (వయసు: 96) తుది శ్వాస విడిచారు.

ఇలాంటి నిజమైన దేశభక్తులను స్మరించుకుంటూ, ఆమె జీవిత చరిత్రను భారతదేశ చరిత్రలో చిరకాలం నిలిచి ఉండేలా నేటి తరానికి అందించేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని జయ కేతనం కోరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్