జయకేతనం న్యూస్ ఆగస్టు 30
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గోనె విజయ, ఖమ్మంపాటి లక్ష్మమ్మలు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో సుమారు 1200 మంది అమరులైనారని వారిని స్ఫూర్తిగా తీసుకొని మహిళలు కూడా కేసులకు భయపడకుండా ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యమ సాధనలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉద్యమకారుల కు ఎన్నికల ముందు ఇచ్చిన 25 వేల రూపాయల పెన్షన్,250 గజాల ఇంటి స్థలం, నాలుగు గదుల ఇంటి నిర్మాణం, సాధారణ ప్రమాద భీమా, కార్పొరేట్ తరహాలో ఉచిత వైద్యం వంటి హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. అదేవిధంగా అస్సాం, ఒరిస్సా, రాష్ట్రాల తరహాలో 100 ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తక్షణమే హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జెఏసి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుట్టా సోవమ్మ, కార్యదర్శి నోముల ఉమా,పట్టణ అధ్యక్షురాలు బంటు ఎల్లమ్మ, కార్యదర్శి కొమ్మాండ్లపల్లి సుజాత,పట్టణ కమిటీ సభ్యులు మాచర్ల రామలక్ష్మి,సాయని సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.









