నలుగురు నిందితులకు 5 సంవత్సరాల 45 రోజుల జైలు శిక్ష

నలుగురు నిందితులకు 5 సంవత్సరాల 45 రోజుల జైలు శిక్ష.

*👉🏻వ్యక్తిపై భౌతిక దాడి, తీవ్ర గాయాలు కలుగజేసిన కేసులో నేరస్తులుగా గుర్తించి తీర్పు వెల్లడించిన హుజూర్ నగర్ కోర్టు*

జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 12

నేరాలకు పాల్పడితే ఏనాటికైనా జైలు శిక్షలు తప్పవు అని, ఎంతటివారైనా చట్టం నుండి తప్పించుకోలేరు జిల్లా ఎస్పీ నర్సింహా తెలిపారు, ప్రతి ఒక్కరు చట్ట పరిధిలో నడుచుకోవాలని సమస్యలు వస్తే సామరస్యంగా పరిష్కరించుకోవాలని పెద్దలను పోలీస్ స్టేషన్లను ఆశ్రయించాలి క్షణికావేశంలో నేరాలకు పాల్పడకూడదని అన్నారు, సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ పోలీస్ ప్రజా భరోసా ద్వారా గ్రామాలలో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నామని తెలిపారు

కేసు వివరాలు:

2018 సంవత్సరం మార్చి నెలలో రాత్రి నలుగురు వ్యక్తులు కలిసి గరిడేపల్లి మండలం లుంభ తండా కు చెందిన వ్యక్తి పై మండల పరిధి లుంబ తండా, సోమ్లా తండా లకు చెందిన నలుగురు వ్యక్తులు రాత్రి సమయంలో పథకం ప్రకారం దాడి చేసి తీవ్రంగా కొట్టి తీవ్ర గాయాలు కలగజేసినందుకుగాను ఫిర్యాదు దారి ఇచ్చిన ఫిర్యాదు పై సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్ నందు దాడి కేసు నమోదు చేయడం జరిగినది. కేసును విచారించి
మొదటి నేరస్తుడు బానోతు శివ(29) వృత్తి వ్యవసాయము లంబ తండా గ్రామం, రెండవ నిందితుడు గుగులోతు శంకర్ (36) వృత్తి వ్యవసాయం లుంభతండ, మూడవ నిందితుడు గుగులోతు బాలు (32)  సోమ్లా తండా , నాలుగవ నిందితుడు గుగులోతు చిన్న  (40)  నలుగురుని నిందితులుగా చేర్చి అప్పటి కేసు దర్యాప్తు అధికారి ఎస్సై సైదులు కేసు నేర అభియోగ పత్రాలను హుజూర్ నగర్ కోర్టుకు సమర్పించడం జరిగినది. ఈ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కోర్టుకు బాధితులను, సాక్షులను, నిందితులను సకాలంలో హాజరు పరుస్తూ వాదనలు వినిపించడం జరిగినది. ఈ కేసులో సాక్షులను బాధితులను విచారించిన హుజూర్ నగర్ సెషన్స్ కోర్టు జడ్జి డా.ఎం రాధాకృష్ణ  తీర్పును వెల్లడించారు నిందితులు నలుగురు  ఉద్దేశపూర్వకంగా దాడి చేసి గాయపరిచారని నేరం రుజువు కావడంతో నిందితులను నేరస్తులుగా భావించి 5 సంవత్సరాల 45 రోజులు కరగార శిక్ష విధించారు ఈ కేసును బాధితుల తరఫున శిలువేరు వెంకటేశ్వర్లు అదనపు పీపీ వాదనలు వినిపించారు. ఎప్పటికప్పుడు కోర్టులతో సమన్వయం చేసుకొని హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమంద రాజు, గరిడేపల్లి ఎస్సై నరేష్, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్స్ సైదులు, రాము, కోర్టు లైజన్ పోలీసు అధికారి హెడ్ కానిస్టేబుల్ రవి బాగా పనిచేశారని జిల్లా ఎస్పీ నర్సింహా అభినందించారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్