వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలో ఏసీబీ దాడులు
50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన మోమిన్ పేట వ్యవసాయ అధికారి-బూపతి జయ శంకర్
విత్తనాలు,ఎరువులు & పురుగుమందుల దుకాణానికి లైసెన్స్ జారీ చేయడానికి లక్ష డిమాండ్
జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 24
వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట మండలంలో విత్తనాలు,ఎరువులు & పురుగుమందుల దుకాణానికి లైసెన్స్ జారీ చేయడానికి అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి మోమిన్ పేట మండల వ్యవసాయ అధికారి – బూపతి జయ శంకర్ మొదటగా రూ.1,00,000/- లంచం డిమాండ్ చేసి అందులో నుండి రూ.50,000/- తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.”ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని తెలిపారు









