2,00,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్ గుగులోతు కృష్ణ
జయకేతనం న్యూస్ అక్టోబర్ 09
“యం/ఎస్ రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ఒక వ్యవసాయ భూమి యొక్క మోటేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మరియు మరొక వ్యవసాయ భూమి యొక్క సర్వే నివేదికను చిట్యాల రక్షక భట నిలయ సబ్ ఇన్స్పెక్టర్ కి సమర్పించడం కోసం” ఫిర్యాదుధారుని నుండిరూ.2,00,000/- లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా చిట్యాల మండల తహశీల్దార్ గుగులోతు కృష్ణ మరియు మరియు ప్రైవేట్ వ్యక్తి – గట్టు రమేష్ లు గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణఅవినీతి నిరోధక శాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.”ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును









