30,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గంధంగూడ సబ్-స్టేషన్ సహాయక ఇంజనీర్-అమర్ సింగ్.
జయకేతనం న్యూస్ అక్టోబర్ 18
“ఎ.ఆర్.సి.కె.ప్రాజెక్ట్స్ అపార్ట్‌మెంట్ లో కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి” ఫిర్యాదుధారుని నుండి రూ.30,000/- లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్‌లోని హిమాయత్ సాగర్ సెక్షన్‌లోగల గంధంగూడ సబ్-స్టేషన్‌లోని సహాయక ఇంజనీరు -అమర్ సింగ్. తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కారు
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన”వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు తెలిపారు









