15,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై పి. శ్రీకాంత్ అతని ప్రైవేట్ డ్రైవర్ ఎం.డి.నజీర్
జయ కేతనం న్యూస్ జనవరి 8
ఫిర్యాదుధారునిపైన వరంగల్ కమిషనరేట్‌లోని కె.యు.సి. రక్షక భట నిలయంలో నమోదైన ఒక కేసులో అతనికి నోటీసు జారీ చేయడనికి, ఛార్జిషీట్‌ను త్వరగా దాఖలు చేయడానికి మరియు జప్తు చేసిన వాహనాలను మొబైల్ ఫోన్లతో పాటు విడుదల చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/- లంచం తీసుకుంటూ వరంగల్ కమిషనరేట్‌లో గల కె.యు.సి. రక్షక భట నిలయంలోని సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. శ్రీకాంత్ మరియు అతని ప్రైవేట్ డ్రైవర్ ఎం.డి.నజీర్ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ఏ సి బీ యొక్క టోల్ ఫ్రీ నంబర్‌ను అంటే 1064ను సంప్రదించాలని అభ్యర్థించారు. ఏ సి బీ తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు whatsapp (9440446106), ఫేస్ బుక్ (తెలంగాణ ఏసీబీ), ఎక్స్/గతంలో ట్విట్టర్ (@తెలంగాణ ఏసీబీ) ద్వారా కూడా సంప్రదించవచ్చు. ACB యొక్క QR కోడ్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రముఖ బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించబడుతుంది, ACB, తెలంగాణను సంప్రదించడానికి. బాధితుడు/ఫిర్యాదుదారుడి పేరు మరియు వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు








