ఇంటినెంబర్ కేటాయించేందుకు 6000/- లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి
6,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బర్పతి కృష్ణ
జయ కేతనం న్యూస్ జనవరి 9
ఫిర్యాదిధారుడు నూతనంగా నిర్మించుకున్న గృహానికి ఇంటి నంబర్ కేటాయించడం కోసం ఫిర్యాదుధారుని నుండిరూ.6,000/- లంచంతీసుకుంటూ సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలంలోగల గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి బర్పతి కృష్ణ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ఏ సి బీ యొక్క టోల్ ఫ్రీ నంబర్‌ను అంటే 1064ను సంప్రదించాలని అభ్యర్థించారు. ఏ సి బీ తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు whatsapp (9440446106), ఫేస్ బుక్ (తెలంగాణ ఏసీబీ), ఎక్స్/గతంలో ట్విట్టర్ (@తెలంగాణ ఏసీబీ) ద్వారా కూడా సంప్రదించవచ్చు. ACB యొక్క QR కోడ్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రముఖ బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించబడుతుంది, ACB, తెలంగాణను సంప్రదించడానికి. బాధితుడు/ఫిర్యాదుదారుడి పేరు మరియు వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు








