1-19 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు తప్పకుండ ఆల్బండాజోలు మాత్రలు వేయించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు కోరారు. సోమవారం ఆయన బాలెంల సోషల్ వెల్ఫేర్ స్కూల్ మరియు డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులను తినిపించారు.అల్బెన్దజోల్ మాత్రలు వేసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా పిల్లలలో మెరుగైన మానసిక, శారీరక అభివృద్ధికి తొడ్పడుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమం అన్ని గవర్నమెంట్, ప్రైవేట్ అన్ని అంగన్వాడీ స్కూల్స్ లో నిర్వహించడం జరుగుతుందని, దగ్గర్లోని స్కూల్స్ లో ఆల్బండాజోలు మాత్రలు వేయించాలని అయన కోరారు. జిల్లా వ్యాప్తంగా 204578 మంది కి ఆల్బండాజోలు మాత్రలు వేయనున్నట్లు తెలియజేసారు. ఎవరైనా మాత్రలు వేసుకోవడం తప్పిపోతే అలాంటి వారు ఈ నెల 18వ తేదీన మొప్అప్ డే రోజు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యధికారి డా. చంద్రశేఖర్ , జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా. కోటి రత్నం, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. నీలా, స్కూల్ ప్రిన్సిపాల్ అరుణ, కాసరాబాద్ వైద్యధికారి డా. స్రవంతి, బాలెంల పల్లెదావఖానా వైద్యుడు డా. మణిరత్నం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ధనమ్మ, పి హెచ్ ఎన్ సైదమ్మ, హెచ్ ఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు









