ఎన్నికల నియమావళి పై అవగాహన కార్యక్రమం

ఎన్నికల నియమావళి పై అవగాహన కార్యక్రమం

సీఐ చరమంద రాజు

జయ కేతనం న్యూస్ పాలకీడు
సర్పంచ్ ఎన్నికల నియమాలు అమలులో భాగంగా సూర్యాపేట జిల్లా పాలకీడు మండల పరిధిలోని శూన్య పహాడ్ గ్రామంలో పోలీసు, జిల్లా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఎన్నికల నియమావళి ఎన్నికల ప్రాముఖ్యతను గురించి ప్రజలకు అర్థమయ్యేలా పోలీసు కళాబృందం కళాకారులు ఆటపాట సాంస్కృతిక కార్యక్రమాలతో చైతన్యపరిచారుఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హుజూర్నగర్ సి ఐచరమందరాజు మాట్లాడుతూ
ప్రజలు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని, ఎన్నికల సమయంలో తగాదాలు పెట్టుకుంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని వారికి వివరించారు. గ్రామాలు ఎన్నికల విషయంలో మంచి చరిత్రను కలిగి ఉండాలని సూచించారు. ప్రలోభాలకు గురి కావొద్దు అన్నారు. సోషల్ మీడియాలో ఇతర వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు గానీ అనుచిత పోస్టులు గాని చేయవద్దని కోరారు. ఎన్నికల సమయంలో గ్రామంలో శాంతిభద్రతులకు విగాథంకలిగించకుండా ఎన్నికల నియమావళికి లోబడి ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని తెలియజేశారు.గ్రామంలో ప్రశాంత వాతావరణం కలిగి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఐ కోటేష్ పోలీస్ సిబ్బంది ప్రేమ్ కుమార్, నటరాజ్,పోలీస్ కళాబృందం ఇంచార్జి యల్లయ్య, సభ్యులు గోపయ్య,చారి, కృష్ణ, గురులింగం సత్యం గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్