
ఎస్సీ బాలుర హాస్టల్ లలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమీక్ష సమావేశం
జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 13
నేరేడుచర్ల ఎస్సీ బాలుర హాస్టల్ నందు విద్యార్థుల తల్లిదండ్రులతో బాలుర వసతి గృహ సంక్షేమ అధికారి డి. దేవదాస్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆలోచనలో మార్పు రావాలని, ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యంతో చదవాలని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలవాలని తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని కోరారు. తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ పిల్లలను చెడు వ్యసనాలకు దూరంగా ఉండేటట్లు చూడాలని పాఠశాలకు క్రమం తప్పకుండా పంపించాలని పిల్లల పట్ల బాధ్యత రహితంగా ఉండకూడదని ఎల్లప్పుడూ వాళ్ళ ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలని ఉపాధ్యాయులను పెద్దలను గౌరవించే విధంగా చూడాలని కోరారు. వసతి గృహ సంక్షేమ అధికారి మాట్లాడుతూ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తమ వంతు కృషి చేస్తామని తల్లిదండ్రులు కూడా సహకరించాలని తల్లిదండ్రులను కోరారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు తమ పాటలతో అందర్నీ అలరించారు. కార్యక్రమంలో వసతి గృహ సిబ్బంది నాగరాణి, అంజయ్య, వెంకటయ్య, అలివేలు, ట్యూటర్ పాశం లూకాస్ పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి ఆలోచనలో మార్పు రావాలని, ప్రతి ఒక్కరు ఉన్నత లక్ష్యంతో చదవాలి
హుజూర్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్ నందు తల్లిదండ్రుల సమీక్ష సమావేశం బాలుర వసతి గృహ సంక్షేమ అధికారి చిట్యాల రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ పిల్లలను చెడు వ్యసనాలకు దూరంగా ఉండేటట్లు చూడాలని పాఠశాలకు క్రమం తప్పకుండా పంపించాలని, పిల్లల పట్ల బాధ్యతారహితంగా ఉండకూడదని ఎల్లప్పుడూ వాళ్ళ ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలని, ఉపాధ్యాయులను పెద్దలను గౌరవించే విధంగా చూడాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు శాస్త్రి మరియు వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు









