కాంగ్రెస్ ప్రభుత్వం అంత దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడ లేదు.మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం

కాంగ్రెస్ ప్రభుత్వం అంత దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడ లేదు

కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాక్యాలపై ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 05

సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ
రాష్ట్రంలో యూరియా కొరతప ట్ల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై, కాలేశ్వరం ప్రాజెక్టుపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.రాష్ట్రంలో యూరియా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.నమ్మి ఓట్లు వేసిన రైతులను నట్టేట ముంచి హరిగోసలు పాలు చేస్తున్నారన్నారు. అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం యెక్క అసమర్థత స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.యూరియా కోసం రోజుల తరబడి లైన్లలో నిల్చోవలసిన పరిస్థితి తీసుకొచ్చారన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో యూరియా అందించామన్నారు.వాళ్ల పార్టీ మంత్రులే యూరియా లేదటుంటే రేవంత్ మాత్రం సరిపడా ఉందని అబద్ధం చెపుతున్నారన్నారు.2014 కు ముందు నీళ్లకోసం కొట్టుకున్నోళ్లు నేడు యూరియా కోసం కొట్టుకునే పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. ప్రభుత్వ హాస్టల్లో పిల్లలే భోజనం సరిగ్గా లేదని ధర్నాలు చేస్తున్నారన్నారు మెస్ చార్జీలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెగ్డేవా చేశారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారుల కిరాణా కోట్లు, కూరగాయల వ్యాపారుల దయాదాక్ష్యన్యాల తోటి హాస్టళ్ళు నడిచే పరిస్థితి తీసుకొచ్చిందన్నారు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కి సామర్థం లేదని విద్యాశాఖ తన దగ్గర పెట్టుకుని పిల్లల జీవితాలతో ఆటలాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలన్నారు. ఒక్కసారి రివ్వు చేసుకుంటే నైనా సిగ్గు వస్తుందని అన్నారు ఏంతసేపు కేసీఆర్ ని కేటీఆర్ ని తిట్టడం తప్పా వేరే పని లేదని రాష్ట్రంలో ప్రజల డబ్బులు దండుకోవడంలో మంత్రులు పోటీ పడుతున్నారే తప్పా ఏ రంగాన్ని చక్కగా చూసుకునే పరిస్థితి లేదన్నారు. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి దేశవ్యాప్తంగా పెరుగాంచించిందని కరోనా సమయంలో యనలేని సేవలందించిదని అన్నారు ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ వైద్యమంటే భయపడే పరిస్థితి నేటి పాలకులు తీసుకొచ్చారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాక్యాలపై తీవ్రంగా మండిపడ్డారు.నీళ్లను వాటర్ లో కలిపే మంత్రులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వందల టీఎంసీల నీళ్లు ఒకపక్క సముద్రంలో కలుస్తుంటే
నల్లగొండ గడ్డపైన ఉన్న ఎస్ ఎల్ బి సి ఉదయసముద్రం ఎండిపోయే పరిస్థితి అయినా ఇంకా ఎస్ ఏల్ బి సి పూర్తిచేస్తామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు.సచ్చిన శవాలను తీయడానికి ఇప్పటి వరకు దిక్కులేదు.ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా ఉండదన్నారు.ఎప్పటికైనా నువ్వు నీ సీఎం రేవంత్ బిజెపిలో చేరే వాళ్లే అని హెద్దేవ చేశారు. కాళేశ్వరం సీబీఐ కి అప్పగించి మోడీని కలుస్తారంటా కాంగ్రెస్ ప్రభుత్వం రండలాగా వ్యవహరిస్తోంది.మీరు ఢిల్లీకి వెళ్లి రహస్యంగా గడ్కరీని,అమిత్ షాని కలిసిన విషయం తెలుసు అన్నారు. ఓపక్క మీ రాహుల్ గాంధీ సీబీఐ,ఈడీ లు,ఐటీ డిపార్ట్ మెంట్ లు బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా పని చేస్తున్నాయని బీహార్ లో మొత్తుకుంటుంటే బిజెపికి సీబీఐ పొలిటికల్ రిక్రూట్మెంట్ సెంటర్ గా పనిచేస్తుందనడం హాస్యస్పదంగా ఉందన్నారు.కృష్ణా నీళ్లు సముద్రం పాలవుతుంటే నల్లగొండ రైతులకు నీళ్లు లేకుండా అయితున్నాయి.నీళ్ళల్ల వాటర్ కలుపుతావో.వాటర్ లో నీళ్లు కలుపుతావో కాని నల్లగొండ ప్రజలకు మాత్రం నీళ్లు ఇవ్వాలన్నారు.కేసులు చేదించడంలో టెక్నాలజీని వాడడంలో తెలంగాణ పోలీసే నెంబర్ మీరేమో మేము,మా పోలీసులకు చేతకాదు అందుకే సీబీఐ కి అప్పజెప్తమని సిగ్గులేకుండా తీర్మానం చేసుకుంటున్నారు.అది కూడా సరిపోకుంటే మీరు మీ సీఎం పోయి ఫ్ బి ఐ ఇచ్చుకోమన్నారు లేదంటే నేత న్యాహు కాళ్లు పట్టుకొని మోసాద్ ఇచ్చుకోండని అన్నారు.
ఈ రాష్టంలో పనిచేస్తున్న ఏకైక శాఖ పోలీస్ శాఖ మాత్రమేనని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించోద్దని పోలీసులు అంటే రాజకీయాలకతీతంగా పనిచేయాలని తెలిపారు.కేసిఆర్ హయాంలో ఎంత ప్రశాంతంగా ఉన్నామో ప్రజలందరికీ తెలుసని మీరు కూడా గుర్తుంచుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్