కేరళ లో మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆప్ ఇండియా(యునైటెడ్)-యంసిపిఐ (యు) కేంద్ర కమిటీ సమావేశం

 

జయకేతనం న్యూస్ ఆగస్టు 17

ఆగష్టు 15,16,17 తేదీలలో కేరళ రాష్ట్రం అలువా నగరంలో వైయంసిఎ హల్ లో యం.సిపిఐ (యు) కేంద్ర కమిటీ మూడు రోజుల సమావేశాలు కామ్రేడ్ కేరళ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ యం.శ్రీ కుమార్ అధ్యక్షతన జరుగుతున్నాయి.ఈ సమావేశంతొలుత ఇటీవల వృద్ధాప్యం, అనారోగ్యంతో మరణించిన పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర కమిటీ సభ్యులు ఆలిండియా ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కేబి శర్మకి, కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ వి యస్ అచ్యుతానందన్ కి, గాజా లో ఇజ్రాయెల్ దురాక్రమణ దాడిలో మరణించిన పౌరులకు పిల్లలకు ప్రకృతి విపత్తులో మరణించిన వారందరికీ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించనైనది సమావేశంను ఉద్దేశించి యంసిపిఐ (యు) అఖిలభారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదం, పెట్టుబడి దారీ విధానం పతనావస్థకు చేరువలో ఉందని అందులో భాగంగానే ఈమధ్య అమెరికా లో అదికారంలోకి వచ్చిన ట్రంప్ అనుసరిస్తున్న యుద్ధోన్మాద విధానాలతో పాటు, సుంకాల పెంపు పేరుతో వాణిజ్య యుద్ధం ప్రారంభం వెనుకాల పతనం అవుతున్న సామ్రాజ్య, పెట్టబడి దారి,కార్పోరేట్ ఆర్థిక విధానాలు అనేది స్పష్టంగా కనపడుతుందని అన్నారు.ఉత్పత్తి పెంచకుండా,ఉత్పత్తి శక్తులు అభివృద్ధి కాకుండా కేవలం దోపిడీ ని ఆధారంగా చేసుకుని ప్రపంచ ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న అమెరికా దాని మిత్ర దేశాలు చావు దెబ్బ తినటం ఖాయం అని అన్నారు.పాకిస్థాన్ – భారత దేశం మద్య, రష్యా, ఉక్రెయిన్ మద్య, పాలస్తీనా-ఇజ్రాయిల్ మద్య,ఇజ్రాయిల్, ఇరాక్ మద్య యుద్ధ వాతావరణం సృష్టించిన అమెరికా వాటిని ఎలా నివారించాలో తెలియక నేడు ఆ ఊబిలో నుంచి ప్రపంచాన్ని దారి మళ్ళీంచే కుట్రతో వాణిజ్య యుద్ధం సాగిస్తున్న తీరు అమెరికా బెదిరింపు లకు రష్యా కానీ, చైనా కానీ చివరకు భారత దేశం కూడా ఎదురు తిరగడం తో అభాసు పాలు అవుతున్న తీరు గమనించాలని దోపిడీ, యుద్దం పరిష్కారం కాదు అనేది స్పష్టంగా సామ్రాజ్య వాద దేశాలు, పెట్టుబడి దారీ శక్తులు గుర్తించాలని సమస్యలన్నింటికీ సరైన పరిష్కారం సోషలిజం-కమ్యునిజం అనే భావన అన్ని దేశాల్లో ప్రజల్లో వస్తుంది అని రానున్న కాలం సోషలిస్టు సమాజానిదే అని అన్నారు.భారత దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా పాలన కూడా నియంతృత్వ పద్దతిలో ఇంకా ఎన్నో రోజులు సాగవు అని వారి పతనం త్వరలో ఉంటుంది అని కామ్రేడ్ అశోక్ ఓంకార్ అన్నారు.పాల్ఘాం దాడి తరువాత పాకిస్తాన్ పై దాడి చేసి వెనువెంటనే ఉపసంహరణ చేసుకోవడం నేను చెపుతెనె యుద్దం ఆగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించటం మన పాలనలో అమెరికా జోక్యాన్ని దేశ ప్రధాని ఖండించక పోవటం భారతదేశ సార్వభౌమత్వం ఇలా ప్రపంచ దేశాల ముందు దిగజారుతున్న, సుంకాల శాతం బారిగా పెంచిన మోదీ షా లు నిమ్మకు నీరెత్తినట్టు గా వ్యవహరించటం మన దేశ కార్పోరేట్ అధిపతులు ఆదాని, అంబానీ ల ప్రయోజనం కోసం దేశ ప్రజల, ఆత్మ గౌరవాన్ని దెబ్బ కొట్టడం తప్ప మరోటి కాదు అని అన్నారు.
ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ పరిరక్షణకు అండగా నిలిచి దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం మే పెద్ద ముద్దాయి గా మారి యావత్ ప్రజాస్వామిక, న్యాయ, రాజ్యాంగ వ్యవస్థల్ని ఖూనీ చేస్తూ తానే ఒక నేరస్తినిగా మారితే చట్టం, న్యాయం ఎవరు కాపాడుతారు అని అన్నారు.
ఎన్నికల స్వతంత్రత ను కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకొన్న విధానం, ఓట్లు తొలింగించిన విధానం, ఎలక్ట్రాన్ ఓటింగ్ మిషన్ లో జరుగుతున్న అనేక లొసుగులు అన్నింటికీ నేడు ముద్దాయి గా కేంద్ర ప్రభుత్వం మారడం ప్రజాస్వామిక శక్తులకు ఆందోళన కలిగిస్తోంది అని యావత్ ప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేసే పెద్ద నియంతృత్వ శక్తుల కుట్ర బట్టబయలు అవుతున్న తీరు పెద్ద సెక్యులర్ దేశం గా ఉన్న భారతదేశానికి ఏ మాత్రం మంచిది కాదు అని భిన్నత్వం లో ఏకత్వం తో రూపోందిన మన సెక్యులర్ రాజ్యాంగ పరిరక్షణకు ప్రజల మరో స్వతంత్ర పోరాటాలు నిర్మిస్తారు ఈ నియంతృత్వ ఫాసిస్టు బావాజాలానికి పరిపాలన కు తలవంచరు అని మోదీ షా ల పాలకులు గుర్తించాలని అన్నారు. ఈ సమస్యలు అన్నింటి కి దేశంలో అమలు అవుతున్న కార్పోరేట్ నూతన ఆర్థిక పారిశ్రామిక విదానాలు, ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు అని ప్రజల శ్రమ ను దోపిడీ చేసే ఈ దోపిడీ ఆర్థిక విధానాలు అవలంబించే పార్టీలకు వ్యతిరేకంగా నిజమైన దేశభక్తి యుత విప్లవోద్యమ శక్తులు అన్ని ఐక్యం కావటం, మార్క్సిజం – లెనినిజం పునాదిగా పార్లమెంటు – పార్లమెంటేతర ప్రజా పునాది ఉద్యమాలు నిర్మాణమే ఏకైక మార్గం అని అందుకోసం మార్క్సిస్టు లు- అంబేద్కర్ వాదులు
దోపిడీ ఆదిపత్యం వర్గాలకు వ్యతిరేకంగా సంఘటిత ప్రత్యామ్నాయం నిర్మాణం ఎన్నికల్లో,ఎన్నికల తరువాత కలిసి పని చేయడం ద్వారా సరైన ప్రత్యామ్నాయం నిర్మాణం చేయటానికి యంసిపిఐ(యు) అందుకు కలిసి వచ్చే అన్ని శక్తులను కలుపుకుని ఐక్యం చేస్తూ, ఐక్యం అవుతూ ముందుకు సాగుతోంది అని రానున్న కాలంలో మరిన్ని ప్రత్యామ్నాయలను నిర్మిస్తుందని అందుకు దేశ వ్యాప్తంగా యంసిపిఐ(యు) శాఖలు పూనుకోవాలి ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశం లో యంసిపిఐ (యు) పొలిటికల్ బ్యూరో సభ్యులు కామ్రేడ్సు కిరణ్ జిత్ సింగ్ షేఖాన్, అనుభవ్ దాస్ శాస్త్రీ, మహేందర్ నేహా, జార్జ్, కృషమ్మాల్, రాజా దాస్, వల్లెపు ఉపెందర్ రెడ్డి, కాటం నాగభూషణం, చంద్ర మోహన్ ప్రసాద్,పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్సు కుంభం సుకన్య,వనం సుధాకర్,వరికుప్పల వెంకన్న, తూమాటి శివయ్య, శ్రావణి పూడి నాగరాజు,యస్ కే ఖాదర్ భాషా, అన్నీస్ జార్జ్, మహేంద్ర పాండే, హర్మేల్ సింగ్, నిరంజన్ సింగ్, గుర్తేష్ సింగ్, రాజబాబు, భూప్ నారాయణ సింగ్, డెన్నిస్, తనక్పన్, తివారీ, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్