జాగృతి జిల్లా అధ్యక్షులు గా సూరారపు కృష్ణవేణి

 

జయకేతనం న్యూస్ ఆగస్టు 14

 

తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా సూరారపు కృష్ణవేణి నియమితులయ్యారు.తెలంగాణజాగృతి వ్యవస్థాపక అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం కృణవేణి ని జిల్లా అధ్యక్షురాలు గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర స్థాయి లో అనుబంధ సంఘాలతో పాటు పలు జిల్లాలకు జిల్లా అధ్యక్షులను కవిత ప్రకటించారు. సూర్యా పేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం నూతన కల్ కు చెందిన సూరారపు కృష్ణవేణి జాగృతి నూతన అధ్యక్షులుగా నియమితులు కావడం పట్ల జాగృతి నాయకులుహర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గా తనకు అవకాశం కల్పించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని జిల్లా అధ్యక్షురాలు కృష్ణ వేణి తెలిపారు. జిల్లాలో ప్రజా సమస్యల పై రాజీ లేని పోరాటం చేస్తామని తన పై ఉంచిన నమ్మ కం తో బాధ్యత అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్