జాన్ పహాడ్ పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలిమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ వి సుబ్బారావు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్

 

జయకేతనం న్యూస్ జూలై 18

సూర్యాపేట జిల్లా పాలక వీడు మండలం జాన్ పహాడ్ పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శి పై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ, కలెక్టర్ లను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ వి సుబ్బారావు కోరినట్లు తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు బిల్లులు మంజూరు చేయాలంటే డబ్బులు డిమాండ్ చేశాడని సోషల్ మీడియాలో ఆడియో రికార్డింగ్ వైరల్ కావడం తన దృష్టికి రాగానే పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు ఆయన మీడియా కు తెలిపారు

స్పందించిన కలెక్టర్

*ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తే సహించేది లేదు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.*

జాన్ పహాడ్ గ్రామానికి 157 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చేసేందుకు పంచాయతీ కార్యదర్శి వెంకయ్య ఒక్కో లబ్ధిదారు నుండి 20వేల నుండి 30 వేలు డిమాండ్ చేసినట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమాచారం అందడంతో తక్షణమే విషయంపై విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని సూర్యాపేట జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.జాన్ పహడ్ పంచాయతీ కార్యదర్శి వెంకయ్య ను తక్షణమే జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి అటాచ్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తే సహించేది లేదని కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు

 

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్