
జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 01
సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం వాహనదారుల క్షేమమే కోరుతూ సామాజిక బాధ్యతను చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు సూర్యాపేటలో గత కొద్దిరోజులు కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. గుంతల కారణంగా రోడ్డుపై వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ట్రాఫిక్ ఎస్ఐ గమనించారు. మనకు ఎందుకులే అని ఊరుకోకుండ ఒక్క పక్క విధులు నిర్వహిస్తూనే వర్షాలకు దెబ్బతిని గుంటలమయంగా మారిన రోడ్లపై గుంతల్లోకి డోజర్ , ట్రాక్టర్ల సహాయంతో గుంతలను పూడ్చి వేస్తూ వాహనా చోదుకులతో, ప్రజలతో శభాష్ పోలీస్ అనిపించుకున్నాడు. సూర్యాపేటలో ఖమ్మం ఎక్స్ రోడ్డు సమీపంలో రహదారిపై గుంతలు వాహనదారులకు పెద్ద ఇబ్బందిగా మారాయి. దీంతో ఎస్ఐ చొరవ తీసుకొని మట్టిని కంకరను కలిపి గుంతలను చదును చేపించారు. వాహనదారులు ఎస్సై సాయిరాం చేస్తున్న తీరును ప్రశంసిస్తూ పోలీస్ అంటే గిట్టుండాలి అంటూ కొనియాడుతున్నారు









