
జయకేతనం న్యూస్ ఆగస్టు 23
పోలీస్ స్టేషన్ ల నందు పోలీస్ సైబర్ వారియర్స్ గా పని చేస్తున్న పోలీసు సిబ్బందికి శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ మోసాల నియంత్రణ, సైబర్ మోసం కేసుల్లో నగదు స్వాధీనం బాధితులకు అందజేత అంశాలపై జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ అధ్వర్యంలో ఒక రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఎస్పి నరసింహ హాజరై సూచనలు అందించారు. సైబర్ నేరాల దర్యాప్తులో అవగాహన,ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ శిక్షణ లక్ష్యం అన్నారు. సైబర్ నేరాల వల్ల సమాజంలో పెరుగుతున్న ప్రమాదాన్ని వివరించారు. సైబర్ నేరాల దర్యాప్తు పద్ధతులు,డిజిటల్ ఫోరెన్సిక్ మరియు ఆధారాల సంరక్షణ, ఆన్లైన్ మోసాల గుర్తింపు మరియు నివారణ, బ్యాంక్ ల నగదు స్వాధీనం బాధితులకు అందించు విధానాలు మరియు నివేదిక ప్రక్రియలు గురించి తెలియపరచండన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా జిల్లా పోలీస్ శాఖ సైబర్ వారియర్స్ సైబర్ నేరాలపై మరింత ప్రభావవంతంగా స్పందించగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. బాధితుల పట్ల సాదరంగా స్పందించాలని వారు పిర్యాదు చేసే స్థితిలో లేకపోతే పిర్యాదు ఆన్లైన్ నందు నమోదు చేసి పిర్యాదు రాసి ఇవ్వాలని సైబర్ వారియర్స్ కు ఎస్పి సూచించారు.సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి ఏపీకే ఫైల్స్ ను, ఫోన్ కు వచ్చే సందేశాలను అనుసరించవద్దు అపరిచితులు వ్యక్తిగత బ్యాంక్ ఖాతా వివరాలు, గుర్తింపు వివరాలు తెలపవద్దు. బహుమతులు వచ్చాయి అంటే డబ్బు చెల్లించవద్దు అన్నారు. సైబర్ మోసానికి గుగైతే 1930 కి పిర్యాదు చేయాలి. పోలీస్ స్టేషన్ నందు సైబర్ వారియర్స్ బాధితులకు సహాయసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు,సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.









