బ్యాంక్ అధికారులు,బంగారం షాప్ యజమానులతో జిల్లా ఎస్పి నరసింహ సమావేశం

 

జయకేతనం న్యూస్ ఆగస్టు 14

 

బ్యాంకు అధికారులకు, బంగారం షాప్ యజమానులకు గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ నరసింహ సమావేశం నిర్వహించి బ్యాంక్ లు, బంగారం దుకాణాల భద్రత చర్యలకు సంబంధించిన సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో భద్రత అదృష్టం పటిష్టంగా పనిచేస్తుందని నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ రాత్రివేళ పెట్రోలింగ్ చేస్తున్నాము అన్నారు. ప్రతి రోజు నైట్ అలర్టింగ్ పోలీసు అధికారిని నియమించి జిల్లాలో భద్రత పర్యవేక్షణ చేస్తున్నాము అన్నారు. నిత్యం పెట్రోలింగ్ చేస్తున్నాము, జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధి ప్రతిరోజు ఫింగర్ ప్రింట్ స్కానర్ తో అనుమానితులను తనిఖీ చేస్తున్నాము అన్నారు. వ్యాపారులు స్వీయ భద్రత చర్యలు పాటించాలని అన్నారు. బ్యాంకు వద్ద, బంగారం దుకాణాల వద్ద చుట్టూ తెలిసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, వచ్చి పోయే మార్గాలు సిసి కెమెరాలతో కవర్ చేయాలని కోరారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే కెమెరాల్లో తెలిసేలా ఉండాలని కోరారు. పెద్ద మొత్తంలో నగదు, విలువైన అభరణాలు నిలవచేసేటప్పుడు భద్రపరిచేటప్పుడు పూర్తి భద్రత చర్యలు తీసుకోవాలి బలమైన లాకర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు అలారం వచ్చేలా అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, ఎవరైనా వ్యక్తులు తాళం పగలగొట్టే క్రమంలో అలారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం మార్కెట్లో అత్యాధునికమైన సాంకేతిక కలిగిన రక్షణ పరికరాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాచ్మెన్ ఏర్పాటు చేసుకొని పర్యవేక్షణ చేసుకోవాలని కోరారు, సీసీటీవీ ఫుటేజీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా సిస్టం ఏర్పాటు చేసుకోవాలి. స్థానిక పోలీసు వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి. వచ్చి పోయే వారి గురించి ఆరా తీయాలి. స్టాక్ కు సంభందించి రికార్డ్ నమోదు చేసుకోవాలని అన్నారు. గోడలకు బలమైన కాంక్రీట్ లేదా ఇముతో రక్షణ కల్పించుకోవాలి. స్వీయ రక్షణ భద్రత చర్యలు పాటించడం ద్వారానే పటిష్టంగా నివారించవచ్చు అని తెలిపినారు. ప్రజలు వారి గృహాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించారు అలాగే దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు విలువైన ఆభరణాలు నగదు ఇంట్లో లేకుండా లాకర్లలో ఉంచుకుంటే మంచిదని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, సి ఐ లు రాజశేఖర్, నాగేశ్వరరావు, శివ శంకర్, నర్సింహారావు, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, పోలీసు సిబ్బంది, బ్యాంకర్స్, బంగారం దుకాణాల యజమానులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్