మణుగూరు సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్-బత్తిని రంజిత్ పై ఏసీబీ కేసు నమోదు
ఫిర్యాదుధారుని నుండి రూ.40,000/- లంచం డిమాండ్
జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 26
ఫిర్యాదుధారుని మరియు అతని సోదరుడి పైన మణుగూరు రక్షకభట నిలయంలో నమోదైన ఒక కేసులో వారిని అరెస్టు చేయడానికి బదులుగా నోటీసు జారీ చేయడానికి” అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.40,000/- లంచం డిమాండ్ చేసినందుకుగాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు రక్షకభట నిలయ అధికారి & సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ -బత్తిని రంజిత్ పై తెలంగాణ అనిశా అధికారులు కేసు నమోదు చేశారు
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును “ఫిర్యాదుధారుల/ బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు తెలిపారు









