జయ కేతనం న్యూస్
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ సంక్షేమమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్ కార్యాలయంలో యార్డులో పనిచేస్తున్న కార్మికులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 58 సంవత్సరాలు దాటిన కార్మికులను తిరిగి పనులలో తీసుకోవద్దని నిబంధన ఉన్నప్పటికీ వారిని తిరిగి పనులు చేసుకునేలా అవకాశం కల్పించాలని జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లకు విన్నవించినట్లు తెలిపారు.త్వరలో ఈ అంశంపై సానుకూల సమాచారం రానున్నట్లు తెలిపారు.యార్డులో పనిచేస్తున్న మహిళలకు మరుగుదొడ్లు, కార్మికులకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేసేందుకు పాలకవర్గం తీర్మానం చేశారు చెప్పారు.
దడువాయిలకు గుర్తింపు కార్డులు అందజేసే విషయంపై త్వరలోనే కమిటీ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అనంతరం యార్డులో పనిచేస్తున్న 875 మంది కార్మికులకు దుస్తులను అందజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మార్కెట్ కార్యదర్శి ఫసియోద్దీన్ (ముక్రం), మార్కెట్ డైరెక్టర్లు ధారవత్ వీరన్న నాయక్, ఆర్తి కేశవులు,దాసరి తిరుమలరావు మెడిమేలపు దామోదర్ రెడ్డి, నకిరేకంటి బాలకృష్ణ, పచ్చిపాల వెంకన్న, గోపగాని పెద్ద వెంకన్న, చిన్నోజు నర్సింహ రావు,అబ్దుల్ కరీం, వుప్పల సత్యనారాయణ,మార్కెట్ సిబ్బంది, దాడువాయిలు,హమాలీలను, అడితి అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









