రూ.2 లక్షల 75 వేల రూపాయల నగదు స్వాధీనం. – రూ.40 వేల విలువైన 270 మీటర్ల రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ స్వాధీనం

జయకేతనం న్యూస్ ఆగస్టు 18

 

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు సోమవారం కేబుల్ దొంగతనం కేసు వివరాలు, అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి నరసింహ వెల్లడించారు జూన్ నెలలో నడిగూడెం మునగాల పోలీస్ స్టేషన్ల పరిధిలో బిఎస్ఎన్ఎల్ టవర్లకు సంబంధించిన ఫ్రీక్వెన్సీ కేబులు దొంగతనానికి గురైనట్లు సంబంధిత బీఎస్ఎన్ఎల్ అధికారులు నడిగూడెం, మునగాల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగినది. దీనిపై నడిగూడెం మరియు మునగాల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ఆధ్వర్యంలో దర్యాప్తు చేయడం జరుగుతుంది. దొంగిలించిన కేబుల్ ను కాల్చి అందులో ఉన్న రాగి తీసి అమ్మి డబ్బులు సంపాదిస్తూ జల్సాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి నడిగూడెం మునగాల పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడం జరిగినది అలాగే సాంకేతికత ఆధారాలతో నిఘా ఉంచడం జరిగింది.ఎవరైనా అనుమానాస్పదంగా బిఎస్ఎన్ఎల్ టవర్ల వద్ద, ట్రాన్స్ఫార్మర్ల వద్ద, కాలువగట్లపై కొత్త వ్యక్తులు గాని అనుమానాస్పదంగా కానీ సంచరించినట్లయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది కేసు దర్యాప్తులో ఉన్నది. సోమవారం ఉదయం సుమారు 8.00 గంటలకు మునగాల పోలీసు స్టేషన్ ప్రవీణ్ కుమార్ కు అందిన నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బంది తో కలసి ఆకుపాముల గ్రామం వెళ్ళి అక్కడ బి ఎస్ ఎన్ ఎల్ టవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదం గా కారుతో ఉండగా వారిని అదుపు లోకి తీసుకుని విచారించగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం రాజాపూరం కు చేసిన మహంకాళి శ్రీనాధ్, బుడుపుల వంశీ కృష్ణ అని బాలాజీనగర్ నందు ఉంటున్నాము తెలిపినారు, అంతేకాక తామిద్దరం మరియు చలిగంటి శ్రావణ్ కుమార్ నివాసం కోదాడ తో కలసి సుమారు (4) నెలల కాలం లో (9) బి ఎస్ ఎన్ఎల్ టవర్స్ నిఘా లేనటువంటి వాటిల్లో మునగాల,కోదాడ టౌన్, హాలియా, చిలుకూరు, నేలకొండపల్లి, హుజూర్ నగర్, నడిగూడెం, మిర్యాలగూడ టూ టౌన్ , గరిడేపల్లి పోలీసు స్టేషన్ ల పరిధిలో కట్టర్, హ్యాక్ సా బ్లేడ్ ఉపయోగించి దొంగతనాలు చేసినామని తెలిపినారు. తదుపరి దొంగతనం చేసిన ఇట్టి కేబుల్ లను దొంగతనం చేసిన దగ్గరలో కాల్చి దాని నుండి కాపర్ వైర్ (రాగి వైర్) ను తీసి బస్తాలలో వేసుకుని హైద్రాబాద్ కు తీసుకువెళ్లి అక్కడ జీడిమెట్ల, పటాన్ చెరువు ఏరియా లో ఫ్యాక్టరీ కి సంబంధించిన గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బులు పంచుకుని జల్సాలు చేస్తున్నారు. ఈ విధంగా (9) దొంగతనాలకు సంభందించి మొత్తం రూ. 3,25,000/- విలువైన బిఎస్ఎన్ఎల్ టవర్ కేబుల్ (గవర్నమెంట్ ప్రాపర్టీ) ని దొంగిలించగా వారి వద్ద నుండి రూ. 2,75,000/- నగదు, నడిగూడెం పోలీసు స్టేషన్ కి సంబంధించిన కేసు ప్రాపర్టీ 270 మీటర్ల ఆర్ ఎఫ్ కేబుల్ దొంగతనాలకు ఉపయోగించిన ఫోర్డ్ కారు, కట్టర్, హ్యాక్ సా బ్లేడ్, మరియూ దొంగతానాలకు ఉపయోగించిన ఫోర్డ్ ఫిగో కార్ ఏపీ 20-ఏ ఎల్ -7002 లను నిందితుల నుండి స్వాదీనం చేసుకోవటం జరిగింది. కోదాడ పట్టణం బాలాజీనగర్ కు చెందిన శ్రావణ కుమార్ గతంలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ నందు పని చేసిన అనుభవం ఉన్నది, ఇతనిపై గతంలో 4 దొంగతనం కేసులు ఉన్నాయి. ఏ 1 శ్రీనాథ్,ఏ2 వంశీకృష్ణ ను రిమాండ్ కు తరలించటం జరుగుతుంది. ఇట్టి కేసు నందు నిందితుల ఆచూకీ వెలికి తీయటం లో విశేషంగా కృషి చేసిన మునగాల సిఐ రామకృష్ణా రెడ్డి, ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది కొండలు, ఎం. రామారావు లను అభినందిస్తూ వారికి రివార్డ్స్ అందించడం జరిగినది.
దొంగతనాల నివారణలో ప్రజలు పోలీసు వారికి సహకరించాలి, అనుమానితుల సమాచారం అందించాలని ఎస్పి కోరారు. అలవాటుగా నేరాలకు పాల్పడితే అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు

నిందితుల వివరాలు .
ఏ-1.మహంకాళి శ్రీనాధ్ వ. 20 సం. కులం. బలిజ వృత్తి. కార్ మెకానిక్ నివాసం రాజాపురం గ్రామం అన్నపురెడ్డిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
ప్రస్తుత నివాసం బాలాజీ నగర్, కోదాడ.
ఏ-2.బుడుపుల వంశీ కృష్ణ వ. 20 సం. కులం. గౌడ వృత్తి ఎలక్ట్రీషియన్ నివాసం రాజాపురం గ్రామం, అన్నపురెడ్డిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
ఏ-3.చలిగంటి శ్రావణ్ కుమార్ వృత్తి ఎలక్ట్రిషన్. నివాసం శ్రీనివాస నగర్, కోదాడ టౌన్.(ఇతడు పరారీలో ఉన్నాడు).

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్