సాయి ఈశ్వర చారి ఆత్మ బలిదాన ఘటన బాధాకరమైనది ఇటువంటివి పునరావృతం కాకూడదు
జయ కేతనం న్యూస్ డిసెంబర్ 5
నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయనే బాధతో నిన్న ఫిర్యాదుగూడలో ఆత్మహత్యాయత్నం చేసిన సాయి ఈశ్వర చారి తమ్ముడి ఘటన నన్ను తీవ్రం గా కలచి వేసింది.
ఈ ఘటన పై బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు.మన హక్కుల కోసం పోరాటం చేస్తున్న బీసీ–బహుజన యువకులు ఇలాంటి చర్యలకు దిగడం మన సమాజానికి ఎంతో బాధాకరం.తెలంగాణ సాధనలో 12 వందల మందికి పైగా బీసీ, బహుజన, వంచిత వర్గాల బిడ్డలు తమ ప్రాణాలు అర్పించారు ఇక చాలు. ఇక నుంచి బలిదానాలు కాదు ,పోరాటమే మార్గం.మన హక్కులు,మన రిజర్వేషన్లు మన గౌరవం ఆత్మహత్యలతో రాదు ఐక్యత,స్ఫూర్తి,రాజకీయ చైతన్యంతో మాత్రమే సాధ్యమవుతుంది.
బీసీ–బహుజన బిడ్డలందరికీ నా పిలుపు:
ఆత్మహత్య మార్గం కాదు — పోరాటమే మార్గం.
మన లక్ష్యం సాధించాలంటే మనం బలంగా, చైతన్యంగా, ఒకటిగా నిలబడాలి.
సాయి ఈశ్వర చారి తమ్ముడు త్వరగా కోలుకొని, మునుపటి ధైర్యంతో, కొత్త సంకల్పంతో తిరిగి జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈ సంఘటన మనందరికీ ఒక గట్టి హెచ్చరిక.ఇకపై ఎవరూ ఇలాంటి చర్యలు చేయకండి.మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.అది మన ఓటు ద్వారా, మన ఆత్మగౌరవం ద్వారా, మన పోరాటం ద్వారా నిర్మించబడుతుంది.
హిస్సా,ఇజ్జత్,హుకుమత్ ల కోసం అందరం కలిసి పోరాడుదాం.అధిపత్య కులాల దోపిడీకి ఘోరీ కట్టుదాం.
మన హక్కుల కోసం మనంవేడుకోవటం కాదు ,పోరాటం ద్వారా సాధించుకుందం
అది మన ప్రాణ త్యాగాల ద్వారా కాదు, మన రాజకీయ సంకల్పం మరియు నిస్వార్థ పోరాటం ద్వారా.తెలంగాణ మళ్లీ బలిదానాల గడ్డ కాకూడదు— పాలన, గౌరవం, న్యాయం, హక్కుల అడ్డా కావాలి.మనకు మోసం చేసినవారికి ఓటు ద్వారానే సమాధానం చెప్పాలి.మన మహనీయులు ఫూలే, అంబేడ్కర్, కాన్షీరాం చూపిన మార్గంలో నడుద్దాం —మన ఆశయాన్ని సాధిద్దాం.
“ప్రాణం విలువైనది — పోతే తిరిగి రాదు.పోరాటం పవిత్రమైనది — కానీ ఆత్మబలిదానం దానికి మార్గం కాదు”అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు









