సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్వాహా చేసిన ముఠా అరెస్ట్
నిందితుల వద్ద నుండి 44 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సీజ్, 7.30 లక్షల నగదు,6 సెల్ ఫోన్లు,6పాస్ బుక్కులు
స్వాధీనం
జయకేతనం న్యూస్ అక్టోబర్06
సూర్యాపేట జిల్లా లో బిఆర్ఎస్ పార్టీ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిఏలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పక్కదారి పట్టిస్తూ లక్షల రూపాయల దోచుకున్న విషయం మరవక మునుపే హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండలంలో పక్షవాతంతో ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకొని గత హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి రిఫరెన్స్ తో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇట్టి దరఖాస్తు దారుకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లబ్ధిదారుడికి చేరకపోవడంతో మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో మేళ్లచెరువు పోలీసులు క్రైమ్ నెంబర్ 184/2025 కేసు నమోదు చేసి కేసును విచారించిన పోలీసులు 8 మంది ఏ1) పెండెం వెంకటేశ్వర్లు నేరేడుచర్ల మండలం సోమారం గ్రామం (మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి డేటా ఎంట్రీ ఆపరేటర్),2) బెల్లంకొండ వెంకటేశ్వర్లు( ఏ1 బంధువు) 3) (మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రైవేట్ పిఎ) ఓంకార్ 4) మాదాసు వెంకటేశ్వర్లు5) మఠంపల్లి సైదులు6) గొట్టేముక్కల వెంకటేశ్వర్లు7) బెల్లంకొండ సైదులు 8) బెల్లంకొండ పద్మ లను అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుండి34.58 లక్షల విలువైన 44 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు 7.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎనిమిది మంది నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపుతున్నట్లు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ నరసింహ వివరాలను వెల్లడించారు. 2023 ఎలక్షన్ కంటే ముందు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు మంజూరైన చెక్కులను నిజమైన లబ్ధిదారులకు అందకుండా అదే సర్ నేమ్ తో ఆ పేరు గల వ్యక్తులను గుర్తించి వారి ఖాతాలోకి చెక్కులను మళ్లించి డ్రా చేసుకొని ఆ పేరు గల వారికి,మధ్య వ్యక్తులకు కొంత ముట్ట చెప్పి ఏ1,ఏ2,ఏ3 లు సుమారు తొమ్మిది లక్షల 50 వేల రూపాయల ఏడు చెక్కులను నకిలీ లబ్ధిదారుల పేరున డ్రా చేసుకోవడం జరిగింది. నకిలీ లబ్ధిదారులకు కొంత అమౌంట్ అందజేయడంతో నిజమైన లబ్ధిదారులకు తెలిస్తే ఏమవుతుందో అన్న భయంతో నకిలీ లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులకు రెండు లక్షల 25 వేల రూపాయలు అందజేయడం కూడా జరిగిందన్నారు. 2023 ఎలక్షన్ కోడ్ కంటే ముందు మంజూరి అయిన చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ఉన్న వాటిని నకిలీ లబ్ధిదారులను కనుగొని వారి పేరున డిపాజిట్ చేసి వారికి కొంచెం మిగిలిన సొమ్ము పెండే వెంకటేశ్వర్లు బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఓంకార్లు పంచుకోవడం జరిగింది. వీరి వద్ద నుండి మేళ్లచెరువు పోలీసులు 44 లబ్ధిదారుల చెక్కులను స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. నిందితుల బ్యాంక్ ఎకౌంట్ స్టేట్మెంట్లు మరియు నిజమైన లబ్ధిదారుల సమాచారం మేరకు విచారణ కొనసాగుతుందని సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొని చెక్కులు రాని వారు ఎవరైనా ఉంటే మేళ్లచెరువు ఎస్ హెచ్ ఓ ను సంప్రదించాలని ఎస్పి నరసింహ సూచించారు
*స్వాధీనము చేసుకున్న ఆస్తి వివరములు:*
1)44 చెక్కులు,
2)రూ 7,30,000/- రూపాయల నగదు.
3)6 సెల్ ఫోన్లు,
4) 6 బ్యాంక్ పాస్ పుస్తకాలు.
CMRF చెక్కుల కేసును త్వరితగతంగా ఛేదించడం లో పర్యవేక్షణ చేసిన సూర్యాపేట డీఎస్ పి ప్రసన్నకుమార్ , చాకచక్యత ప్రదర్శించన కోదాడ రూరల్ సి.ఐ కె.ప్రతాప్ లింగం, మేళ్ళచెర్వు యస్.ఐ పి.పరమేష్, హెడ్ కానిస్టేబుల్ జూకూరి నాగేశ్వర్ రావు, లింగరాజు, కానిస్టేబుల్స్ మాదాసు రామారావు, దిలీప్ కుమార్, పాలోజు రామక్రిష్ణాచారి, నర్సింహా రావు లను సూర్యాపేట జిల్లా ఎస్ పి కే. నరసింహ అభినందించడం జరిగినది, ఇట్టి కేసులను ఛేదించిన సిబ్బందికి ఎస్ పి రివార్డ్స్ అందించారు.










