సూర్యాపేట అగ్రికల్చరల్ ట్రేడర్స్ అసోసియేషన్ నూతన కమిటీని సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో గల అగ్రికల్చరల్ ట్రేడర్స్ కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట అగ్రికల్చరల్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా చల్లా సత్యనారాయణ 1 వ ఉపాధ్యక్షులుగా ముప్పారపు నాగేశ్వరరావు 2 వ ఉపాధ్యక్షులుగా మాడుగుల నవీన్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా దేవీ రెడ్డి జానకి రామ్ రెడ్డి సహాయ కార్యదర్శిగా కందిమల్ల సత్యనారాయణ కోశాధికారిగా పాలవరపు శ్రీనివాసులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.









