హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులు అరెస్టు

 

జయకేతనం న్యూస్ ఆగస్టు 23

 

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామ శివారులోని మధురా వైన్స్ వద్ద, అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మయ్య (40) పై ఆగస్టు 22న మధ్యాహ్న ఒంటిగంట సమయంలో నలుగురు వ్యక్తులు కర్రలతో దాడి చేసి హత్యాయత్నం చేసిన సంఘటనపై చివ్వెంల పోలీస్ స్టేషన్ లో క్రైం.నెంబర్ 243/2025, సెక్షన్లు 115(2), 117(2), 326(2), 307 r/w 34 BNS చట్టం ప్రకారం ఎస్సై వి మహేశ్వర్ కేసు నమోదు చేయబడింది సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. రాజశేఖర్ ఆద్వర్యంలో చివ్వెంల పోలీసులు సుందరయ్య నగర్, సూర్యాపేట టౌన్ లలో ఆగస్టు 23 ఉదయం నలుగురు నిందితులను పట్టుకున్నారు

 

నిందితుల వివరాలు:

1.దండుగుల శేఖర్, తండ్రి: సీతారాములు, వయసు: 28 సం., వృత్తి: కూలీ, R/o కుడకుడ గ్రామం.

2. పల్లపు గోపి, తండ్రి: వెంకులు, వయసు: 25 సం., వృత్తి: కూలీ, R/o సుందరయ్యనగర్, సూర్యాపేట.

3. పల్లపు రాము, తండ్రి: లింగయ్య, వయసు: 20 సం., వృత్తి: కూలీ, R/o టేకుమట్ల గ్రామం.

4. పసుపుల చంటి, తండ్రి: మల్లయ్య, వయసు: 20 సం., వృత్తి: కూలీ, R/o రాయినిగూడెం గ్రామం.

నేరానికి కారణం:

• నిందితుడు దండుగుల శేఖర్ (ఏ1)దండుగుల లక్ష్మయ్య భార్య వెంకటమ్మతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వలన పూర్వం గొడవలు జరగడం.
• నిందితుడు పల్లపు గోపి (ఏ2) కు రాయి పనుల వివాదంలో దండుగుల లక్ష్మయ్యతో గొడవలు జరగడం.ఈ ద్వేష భావనలతో నిందితులు నలుగురూ కలిసి దండుగుల లక్ష్మయ్యను హత్య చేయాలని పథకం వేసినారు.

సంఘటన వివరాలు:

2025 ఆగస్టు 22న నిందితులు పథకం ప్రకారం దండుగుల లక్ష్మయ్యను చివ్వెంలకు పిలిచి, కర్రలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. బాధితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడంతో నిందితులు కారులో వెంబడించారు. మధురా వైన్స్ వద్ద అతనిపై దాడి చేయాలని యత్నించినా, అక్కడ ప్రజలు ఎక్కువగా ఉండడంతో విఫలమై కర్రలను అక్కడే వదిలేసి AP 07 BQ 1789 నెంబర్ గల స్విఫ్ట్ కారులో పారిపోయారు.

అరెస్టులు-పంచుల సమక్షంలో స్వాధీనం:

నేరంలో వాడిన మారుతి సుజుకీ స్విఫ్ట్ కారు (AP 07 BQ 1789). నిందితుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని
నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో రిమాండ్ కు తరలించడం జరుగుతుందని డి.ఎస్.పి . ప్రసన్న కుమార్ తెలిపినారు.ఇట్టి కార్యక్రమం లో సిఐ రాజశేఖర్ ఎస్ఐ వి మహేశ్వర్ మరియు చివ్వెంల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్