20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్ చంద్ర శేఖర్
జయకేతనం న్యూస్ డిసెంబర్ 5
ఫిర్యాదుధారుని తండ్రి (స్వర్గీయ) కి చెందిన భూమికి సంబంధించి గతంలో జారీ చేసిన మ్యుటేషన్ ప్రొసీడింగ్స్ మరియు సంబంధిత పత్రాలను ఫిర్యాదుధారునికి ఇవ్వడానికి అతని నుండి నల్లగొండ జిల్లాలోని చండూరు మండల డిప్యూటీ తహసీల్దార్ చంద్ర శేఖర్ రూ.20,000/-లంచం డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారు లంచం ఇవ్వడానికి ఇష్టపడక నల్లగొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు వలపన్ని ఫిర్యాదుదారుడి నుండి డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ 20,000/- లంచం తీసుకుంటుండగా అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు.









