టీజేఏ పాలకీడు, నేరేడుచర్ల కొత్త మండల అధ్యక్షులు నియామకం

  • టీజేఏ పాలకీడు మండల అధ్యక్షుడిగా షేక్ నాగుల్ మీరా, నేరేడుచర్ల మండల అధ్యక్షుడిగా పాశం లూకాస్ నియామకం
  • నియామక పత్రాలు అందజేసిన సూర్యాపేట జిల్లా టీజేఏ అధ్యక్షుడు షేక్ సైదా, జిల్లా కమిటీ

 జయకేతనం న్యూస్ : తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీజేఏ) రాష్ట్ర కమిటీ ఆమోదం మేరకు, సూర్యాపేట జిల్లా కమిటీ తీర్మానంతో టీజేఏ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా శనివారం పాలకీడు మండల అధ్యక్షుడిగా షేక్ నాగుల్ మీరా, నేరేడుచర్ల మండల అధ్యక్షుడిగా పాశం లూకాస్‌లను నియమించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టీజేఏ జిల్లా కమిటీ ప్రెస్‌క్లబ్‌లో వీరికి నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా షేక్ సైదా మాట్లాడుతూ, పాలకీడు మరియు నేరేడుచర్ల మండలాల్లో టీజేఏ జర్నలిస్టుల యూనియన్‌ను బలోపేతం చేసేందుకు త్వరితగతిన మండల కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు. టీజేఏ యూనియన్‌కు సహకరిస్తూ, యూనియన్ సమావేశాలకు హాజరవుతూ, జర్నలిస్టుల హక్కుల సాధన మరియు సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు.

 తదుపరి, టీజేఏ పాలకీడు మండల అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా, నేరేడుచర్ల మండల అధ్యక్షుడు పాశం లూకాస్‌లు మాట్లాడుతూ, తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సూర్యాపేట జిల్లా కమిటీకి, అధ్యక్షుడు షేక్ సైదాకు, టీజేఏ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్, టీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు కదిరి వెంకటరమణ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్, టీజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.ఆర్. ఘోరీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఏ సూర్యాపేట జిల్లా కమిటీ ఖజాంచీ కొత్తపల్లి మధుసూదన్, సూర్యాపేట జిల్లా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొల్లోజు నాగేంద్ర చారి, బయ్యారపు రవీంద్ర, మేళ్లచెరువు మండల అధ్యక్షుడు కొమ్ము మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్