జయకేతనం న్యూస్ ఆగస్టు 12
15 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 142 కేజీ గంజాయిని ప్రభుత్వ, కోర్టు ఉత్తర్వుల మేరకు సూర్యాపేట జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో మంగళవారం యాదాద్రి జిల్లా తోక్కాపుర్ గ్రామం లోగల రోమా ఇండస్ట్రీస్ నందు యాజమాన్యం, సిబ్బంది సహాయంతో ప్రభుత్వ సాక్షుల సమక్షంలో గంజాయిని నిర్వీర్యం చేసి బూడిద చేయడం జరిగినదని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఎస్పి నరసింహ తెలిపారు పర్యావరణానికి, ప్రజా జీవనానికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకుని నిర్విర్యం చేయడం జరిగినదన్నారు
డ్రగ్స్ నివారణ అందరి సామాజిక బాధ్యత. డ్రగ్స్, గంజాయి వినియోగించడం వల్ల యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు డ్రగ్స్ రవాణా, వినియోగం నేరం అని ఎస్పి అన్నారు. గంజాయి నివారణ లో జిల్లా పోలీసు కృషి చేస్తుంది అన్నారు. డ్రగ్స్ అమ్మకం, రవాణా, వినియోగం కు సంభందించి పోలీసులకు, డయల్ 100 కు సమాచారం ఇవ్వాలి అన్నారు. డగ్స్, గంజాయి వియోగించే వారిని, వ్యాపారం చేసే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపినారు. తల్లిదండ్రులు పిల్లల అలవాట్లను గమనిస్తూ చెడు వ్యసనాలకు లోనవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులు సూర్యాపేట డివిజన్ డి.ఎస్.పి ప్రసన్న కుమార్, కోదాడ డివిజన్ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి, జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇన్స్పెక్టర్ హరిబాబు సిబ్బంది పాల్గొన్నారు.









