జయకేతనం న్యూస్
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో త్వరలో జరగనున్న ముత్యాలమ్మ జాతర ప్రశాంతంగా జరుపుకోవడానికి పట్టణ ప్రజలంతా సహకరించాలని సిఐ చరమందరాజు కోరారు.సోమవారం హుజూర్ నగర్ సిఐ కార్యాలయంలో ముత్యాలమ్మ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 17,18 తేదీలలో జరుగు ముత్యాలమ్మ జాతర 21 వ తేదీన జరగనున్న కనదుర్గమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గత ఏడాది మాదిరిగా ప్రణాళిక బద్దంగా జాతరనిర్వహించాలని సూచించారు అదే విధంగా రెండు ముత్యాలమ్మ ఆలయాలు,కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణాలలో ఎటువంటి రాజకీయ,సామాజిక,ఆధ్యాత్మిక సంబందింత ఫ్లెక్సీలు పెట్టరాదన్నారు.జాతరలో డిజేలకు అనుమతి లేదన్నారు.జాతర కావలసిన బందోబస్తును ఏర్పాటు చేస్తామని కమిటి సభ్యులకు తెలిపారు.









