జయ కేతనం న్యూస్
భారతీయ జనతా పార్టీ సూర్యపేట నియోజకవర్గ శక్తి కేంద్ర ఇన్చార్జిల సమావేశం పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా హర్ ఘర్ తిరంగా యాత్ర లో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ లో తమ ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి పోలింగ్ బూత్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం నియోజకవర్గ కేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనలో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందన్నారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కీషన్, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, జిల్లా సీనియర్ నాయకులు రంగరాజు రుక్మారావు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు









