గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే ఉత్సవ కమిటీలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి పర్యావరణ రక్షణకు పాటుపడాలి. -డిజే లు, బాణాసంచా పూర్తిగా నిషేదం

 

జయకేతనం న్యూస్ ఆగస్టు 12

గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకునే వారు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పి నరసింహ ప్రకటనలో తెలిపారు. త్వరలో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఉత్సవ కమిటీలు, యువత ముందస్తు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని భద్రత పరమైన చర్యల దృష్ట్యా పోలీసు శాఖ సూచించే నియమ నిబందనలు పాటించాలని ఎస్పి  కోరారు. మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్టించి పర్యావరణ రక్షణకు బాధ్యతగా ఉండాలని అన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా చేయవద్దు, డిజే లు పెట్టవద్దు, బాణసంచా పేల్చవద్దు అన్నారు. మండపాల ఏర్పాటుకు ముందస్తుగా అన్ని అనుమతులు తీసుకోవాలని అన్నారు. ప్రయాణికులకు,సామాన్యులకు, ఇతర మత్తస్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా మండపాలు ఏర్పాటు చేయడం మంచిదని తెలిపారు. శాంతి సామరస్యాల ప్రతీకగా ఉత్సవాలు ఉండాలని అన్నారు, మండపాల వద్ద నిబంధనలు పాటించాలి, పోలీసు అనుమతులు తీసుకోవాలని కోరారు. శాంతి, సామరస్యానికి మనం పాటుపడాలి, సోదరభావంతో అందరూ కలిసి మెలిసి ఉత్సవాలను జరుపుకోవాలి, జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు పటిష్ఠమైన పోలీసు భద్రత ఉంటుంది, ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

పోలీసు సూచనలు

👉🏻 రోడ్ల ఆక్రమించి గణేష్ మండపాలు ఏర్పాటు చేయవద్దు.
👉🏻 డిజే లకు పెట్టడానికి, బాణాసంచా కు అనుమతి లేదు.
👉🏻 మండపాలు ఏర్పాటు చేసే స్థలం పబ్లిక్ స్థలం అయితే సంబంధిత గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ అనుమతి పత్రం తీసుకోవాలి.
👉🏻 ప్రవేట్ వ్యక్తుల స్థలం అయితే స్థలం యొక్క యజమాని అనుమతి పత్రం తీసుకోవాలి.
👉🏻 ఉత్సవాలు ముగిసే వరకు ఉత్సవ కమిటీ సభ్యులు 24 గంటలు మండపాల వద్ద అందుబాటులో ఉండాలి.
👉🏻 మండపాల వద్ద వచ్చి పోయే మార్గాల్లో సిసి కెమెరాలు అమర్చాలి.
👉🏻 భక్తులు వచ్చిపోయే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి.
👉🏻 ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు.
👉🏻 విద్యుత్ శాఖ అనుమతి ఉండాలి.
👉🏻 వివాదాస్పద స్థలాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేయొద్దు.
👉🏻 ఇతరులను రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదంగా మండపాల వద్ద ప్రసంగాలు చేయవొద్దు.
👉🏻 మండపాల వద్ద భక్తి సంబంధిత పాటలు మాత్రమే ప్రసారం చేయాలి.
👉🏻 ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన అనుమతి అర్జీదారులు, ఉత్సవకమిటీ సభ్యులే బాధ్యత వహించాలి.
👉🏻 నిబంధనలు పాటించాలి.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్