జయకేతనం న్యూస్ ఆగస్టు 12
బుగ్గ మాదారం నుండి కందిబండ వరకు లిఫ్ట్ ఇరిగేషన్ కు సుమారు 17 కిలోమీటర్ల మేర 14 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు 47 ఎకరాల భూమిని సేకరించడం జరుగుతుందని ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం పరిహారంగా 23,92,000/- అవార్డును ప్రకటించడం జరిగిందని ఆర్డీఓ శ్రీనివాసులు రైతులకు తెలిపారు మంగళవారం హుజూర్ నగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తహసిల్దార్ సురేందర్ రెడ్డి ఏఈ శ్రీనివాస్ లిఫ్ట్ చైర్మన్ డిడి రామయ్య వైస్ చైర్మన్ రేపాల వెంకట్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు నరాల కొండారెడ్డి లతో కలిసి రైతులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశంలో దొండపాడు, భూమిని కోల్పోతున్న ఇతర గ్రామాల
రైతులు ఆమోదం తెలిపాగా ప్రభుత్వం కేటాయించిన నష్టపరిహారాన్ని పెంచాలని మెమోరండాలు అందజేయడం జరిగింది









