జయకేతనం న్యూస్ ఆగస్టు12
సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు మాజీ సర్పంచి బైరెడ్డి నాగలక్ష్మి జితేందర్ రెడ్డి మంగళవారం స్కూల్ పిల్లలకు ఐడి కార్డ్లు, టై,బెల్టులు పంపిణీ చేశారు. స్కూల్ పిల్లలకు హై స్కూల్ పిల్లలకు కార్పొరేట్ స్కూల్ కు దీటుగా గవర్నమెంట్ స్కూల్ లలో కూడా విద్య బోధిస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.చదువు విషయంలో పిల్లలకి ఎప్పుడు తన వంతు సహకారం ఉంటుందని తెలియజేశారు. ఇదే కాకుండా పిల్లలకి ఏ విధమైనటువంటి సహకారమైన చేయటానికి తాను ముందుంటానని హామీ ఇచ్చారు. ముందు ముందు రోజులలో స్కూల్లో పిల్లలు ఎక్కువ మంది వచ్చే విధంగా చూడాలని ఎంఈఓ కి తెలియపరిచారు.ఇట్టి కార్యక్రమంలో ఎంఈఓ ఇంజమూరి కాటయ్య,ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు బాబు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలు, అటెండర్స్, తదితరులు పాల్గొన్నారు.









