జయకేతనం న్యూస్ ఆగస్టు 12
హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో 23వ వార్డుకు చెందిన చింతల శైలజకు మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ 36వేల రూపాయల చెక్కును హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, మాజీ కౌన్సిలర్ జక్కుల వీరయ్య తో కలిసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజలకు నిరుపేద కుటుంబాలకు అనారోగ్య కారణంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారికి మందులు కూడా కొనలేని పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంతమేరకు వారికి కుటుంబ పోషణ కొరకు ఉపయోగపడతాయని 23వ వార్డు లో అన్ని విధాలుగా ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో నూతన రేషన్ కార్డులు, ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల మరియు నాణ్యమైన సన్నబియ్యం మరియు ఉచిత బస్సు ఉచిత విద్యుత్ అన్ని వర్గాల ప్రజలకు చేకూరే విధంగా ప్రజా పాలన ప్రభుత్వంలో సాధ్యమవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు









