జయకేతనం న్యూస్ ఆగస్టు 13
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు భారి నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించినది ఈ మేరకు సూర్యాపేట జిల్లాకు *రెడ్ అలర్ట్* #RainRedAlert# ప్రకటించడం జరిగింది. ఇప్పటికే చెరువులు కుంటలు వాగులు పూర్తిస్థాయిలో నిండిఉన్నాయి. బారివర్షాలకు ప్రమడకరంగా మారే అవకాశం ఉన్నది కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూర్యాపేట ఎస్పీ నరసింహ జిల్లా ప్రజలను కోరారు ఎక్కడైనా రోడ్లపై నుండి నీటి ప్రవాహం ఉదృతంగా ఉంటే అలాంటి కల్వర్టులు, వంతెనలు దాటవద్దు ప్రమాదాల బారిన పడవద్దు అని కోరారు. జిల్లా పోలీస్ శాఖ అంత అప్రమత్తంగా ఉన్నారు, సెలవులు రద్దుచేసి విధుల్లో నియమించడం జరిగిందని తెలిపారు. ప్రమాదాలు స్థలాలు నాళాలు, వంతెనలు, కల్వర్టు ల వద్ద పికెట్ ఏర్పాటు చేశాము. 🌊 వరద నీరు వంతనెలపై నుండి ప్రవహిస్తే వాహనాలతో వంతెనలు దాటవద్దు అని కోరారు. ప్రజలు పోలీసు వారి సూచనలు పాటించాలి. అత్యవసర సమయంలో డయల్ 100, సూర్యాపేట పోలీస్ కంట్రోల్ రూమ్ కు 8712686026 ఫోన్ చేయాలన్నారు
👉🏻 స్థంబాలు ముట్టుకోవద్దు.
👉🏻రైతులు వ్యవసాయ బొరుల వద్దకు వెళ్ళవద్దు.
👉🏻చేపలవేటకు వెళ్ళవద్దు.
👉🏻పశువులు, మేకలు, గొర్ల మందలు మేతకు పొలాలకు వెళ్ళవద్దు.
👉🏻పాత ఇండ్లలో ఉండవడ్డు,
👉🏻ప్రయాణాలు రద్దు చేసుకోవాలి.
👉🏻 విద్యార్థులను రవాణా చేసే ఆటో, వ్యాన్ డ్రైవర్లు వాహనాలు నిదానంగా నడపాలి.
👉🏻 కూలి పనులకు వెళ్ళేవారు వర్ష సూచన తగ్గేవరకు పనులు అపుకోవాలి.
👉🏻 గృహ నిర్మాణం పనులు చేసే కూలీలు బయట పైఎత్తు పనులు చేయవద్దు,
👉🏻పట్టణాల్లో కొన్ని ప్రాంతాల్లో కాలనీలకు నీరు చేరి అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి.
👉🏻పిల్లలను ఆటలకు బయటకు పంపవద్దు.









