జయకేతనం న్యూస్ ఆగస్టు 14
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా శాఖ గ్రంథాలయం లో గల పాత గ్రంథాలయ స్థలము లో నూతనముగా జిల్లా గ్రంథాలయ భవనం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు ఒక కోటి 50 లక్షల వ్యయంతో సుమారు 700 గజాల స్థలంలో కమ్యూనిటీ హాల్,కార్యాలయం, గ్రంథాల పుస్తక స్టోరేజ్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.ఈ శంకుస్థాపనకార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సూర్యాపేట పట్టణ ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.









